ఆంధ్రప్రదేశ్‌

కేవీపీ పిల్‌పై సకాలంలో స్పందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 14: విభజన చట్టం హామీ మేరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం ఖర్చును కేంద్రమే భరించాలని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఈనెల 19వ తేదీలోగా అఫిడవిట్ దాఖలుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. కేవీపీ పిల్‌పై నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశిస్తూ, ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిందన్నారు. ఇది నిజంగా చంద్రబాబునాయుడికి మంచి అవకాశమని, పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాల దృష్ట్యా దీన్ని సానుకూలంగా మలచుకుని 19వ తేదీలోగా అఫిడవిట్ దాఖలుచేయాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఉండవల్లి విలేఖర్లతో మాట్లాడారు. ఇది కేంద్రాన్ని ఇరుకున పెట్టే అంశమో, తగవు పెట్టేదో ఎంత మాత్రం కాదని చంద్రబాబునాయుడు గ్రహించాలన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీతో చంద్రబాబు సమావేశం కావడం, ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు నెల రోజులు గడువు ఇచ్చినట్టు, ఒక వేళ అప్పటికీ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు చెప్పడం చూస్తుంటే నెల రోజుల్లో ఇంగ్లీషు నేర్పుతామన్న చందంగా వుందని ఎద్దేవా చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోవాలని ఉండవల్లి సూచించారు. నీటిలోనే కాంక్రీటు వేస్తున్నట్టుగా కొన్ని ఫొటోలు తనకు వచ్చాయని, ఈ ఫొటోలకు పోలవరాన్ని హత్య చేస్తున్నారు అనే క్యాప్షన్ కూడా పెట్టారని పేర్కొంటూ, ఈ ఫొటోలను ముఖ్యమంత్రికి పంపించినట్టు తెలిపారు.కాగా కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక ప్రమాదకరమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుందని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌డిఐ (ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిటర్స్ ఇన్సూరెన్స్) బిల్లును వ్యతిరేకించాలని ఉండవల్లి అన్నారు. పటిష్టమైన మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎఫ్‌ఆర్‌డిఐ చట్టంవస్తే దెబ్బతినే ప్రమాదంవుందని ఆరోపించారు. ఇది చట్టబద్ధంగా బ్యాంకింగ్ వ్యవస్థను కూల్చే చట్టమన్నారు. ఎవరైనా బడాబాబులు బ్యాంకు రుణాలు ఎగ్గొడితే, బ్యాంకులకు జరిగే నష్టాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం పూడుస్తుందన్నారు. కొత్త చట్టం వల్ల ప్రజల డిపాజిట్లలో కొంత మొత్తాన్ని షేరుగా మలిచి, మిగిలిన సొమ్మే విత్ డ్రా చేసుకోడానికి బ్యాంకులు ప్రయత్నిస్తాయన్నారు. ఉన్న సొమ్మును చిన్నపాటి వడ్డీ కోసం బ్యాంకుల్లో దాచుకునే ఎంతోమంది సామాన్యులు ఎఫ్‌ఆర్‌డిఐ చట్టంవల్ల తమ డిపాజిట్ల సొమ్మును వెనక్కి తీసుకునే అవకాశం కోల్పోయే ప్రమాదముందని ఉండవల్లి ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రన్న మాల్స్ అంటే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ప్రైవేటు కంపెనీలు చేస్తున్న వ్యాపారమని ఆరోపించారు. నిజానికి బయట మార్కెట్ కన్నా చంద్రన్న మాల్స్‌లో ఎక్కువ రేట్లు ఉన్నట్టు తెలుస్తోందన్నారు.