ఆంధ్రప్రదేశ్‌

విభజన హామీలపై నిలదీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన ఎంపీలపై చైర్మన్ వెంకయ్య నాయుడు అనర్హత వేటు వేసినట్లుగానే లోక్‌సభలో కూడ పార్టీ మారిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీలు డిమాండ్ చేశారు. గురువారం వైఎస్సాఆర్‌సిపి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయి రెడ్డి ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ తదితర అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, ఈ అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, వీటిపై పార్లమెంట్‌లో తమ పార్టీ లేవనెత్తుతుందని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎంపీలపై రాజ్యసభ చైర్మన్ అనర్హత వేటు వేయడాన్ని స్వాగతిస్తామని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టం సవరణలకు రాజ్యసభలో తమ పార్టీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబరు బిల్లుకు ఇతర పార్టీల ఎంపీల మద్దతు కూడగడతామని ఎంపీలు వెల్లడించారు. పార్లమెంట్‌లో వైఎస్సార్‌సిపి అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో చర్చలు జరిపినట్టు ఎంపీలు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రజలలో అనేక అనుమానాలున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 2021 వరకు పూర్తికాదని ఓవైపు కాంట్రాక్ట్ కంపెనీ ట్రాన్స్‌ట్రాయ్ చెప్తుంటే.. వాస్తవాలను కప్పిపెడుతూ వచ్చే ఏడాదే నీళ్లిస్తామంటూ మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సాఆర్‌సిపి ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి విమర్శించారు.

చిత్రం..ఢిల్లీలో గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైకాపా ఎంపీ విజయసాయరెడ్డి