ఆంధ్రప్రదేశ్‌

నేటి నుండి ఉద్యోగుల బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీలకు వీలు కల్పిస్తూ, ప్రస్తుతం బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. నిషేధం ఎత్తివేత శనివారంనుంచి 20వ తేదీ వరకూ అమలులో ఉంటుందని ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజేయకల్లం చెప్పారు. ఈ మేరకు ఆయన జీవో 102 జారీ చేశారు. జూన్ 1 నాటికి కనీసం మూడేళ్లు దాటిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఒకే స్థానంలో ఐదేళ్లుగా కొనసాగుతున్న వారిని బదిలీ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఐటిడిఎ ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది రెండేళ్లు పూర్తయితే దరఖాస్తు కోరవచ్చని అన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని, ఇందుకు ఒక నిర్ణీత దరఖాస్తును వినియోగించాలని సూచించారు. 14వ తేదీలోగా ఉద్యోగులు మూడు ప్రాధాన్యతలతో దరఖాస్తు చేసుకోవచ్చని, కౌనె్సలింగ్ ను 15వ తేదీన ప్రారంభించి 17వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఖాళీల వివరాలు అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని, కౌనె్సలింగ్ వివరాలను ఎప్పటికపుడు వెబ్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని కూడా ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్, రవాణా, విద్యాశాఖ, ఆరోగ్య శాఖలకు మాత్రం ప్రత్యేకంగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం బదిలీల ప్రక్రియ చేపడతారు. ఆదాయవనరులు చేకూర్చే శాఖల్లో ఉద్యోగులు రెండేళ్లకే తమ బదిలీ కోరవచ్చు. జూన్ 30లోగా బదిలీ అవుతున్న సిబ్బందిని మాత్రం ఈ బదిలీల నుండి మినహాయించారు.