ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక టీడీపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకటరావు నేతృత్వంలో మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ టిడి జనార్ధన్, కర్నూలు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు శనివారం సమావేశమయ్యారు. శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక జరుగనుంది. ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై కసరత్తును టీడీపీ ప్రారంభించింది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థి ఎంపికపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కెఇ ప్రభాకర్, శివానంద రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీ్ధర్ రెడ్డి, గంగుల ప్రతాపరెడ్డిల పేర్లు పరిశీలనకు వచ్చాయని సమాచారం. అందులో ఎన్నికల ఖర్చును తాను భరించేందుకు సిద్ధమని కెఇ ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆశావహుల పేర్లను ముఖ్యమంత్రికి తెలియచేస్తామని, ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని కళా వెంకటరావు తెలిపారు.