ఆంధ్రప్రదేశ్‌

ప్రతి నీటి బొట్టూ పొదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: వాగులు, వంకలు, నదుల అనుసంధానంతో ప్రతి నీటిబొట్టును పొదుపు చేసి జలసంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టి కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని జలవనరులశాఖ కార్యాలయంలో శనివారం రాష్ట్ర సమగ్ర జలవనరుల నిర్వహణ - రైతు శిక్షణా కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జలసంరక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చి రూ.14,200 కోట్లు మేర ఖర్చు చేసిందన్నారు. అన్ని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అన్నారు. భూమిపై పడే వర్షపు నీటిని భూగర్భ జలంగా రీచార్జి చేసి నీటిని సద్వినియోగం చేసుకుంటామన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాల స్థాయిని తెలుసుకునే విధంగా రెండు నెలల కాలంలో వెయ్యి సెన్సార్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నీటిని సమర్థవంతంగా ఉపయోగించేందుకు బిందు తుంపర సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. జలసంరక్షణ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టి చెరువుల్లో పూడికతీత, కాల్వల మరమ్మతులు, వెడల్పు చేయడం వంటి పనులను చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు. ఇంకుడు గుంతలను అధిక మొత్తంలో నీరు చేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా వరదలు వచ్చే సందర్భాల్లో అధికంగా నీరు చేరి భూగర్భంలోకి ఆ మొత్తం నీరు ఇంకేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పెద్ద పెద్ద సంస్థలు, కార్యాలయాలు, కంపెనీలు వీటిని ప్రోత్సహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంతకు ముందు శిక్షణ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, శాసనసభ్యులు జలీల్‌ఖాన్, తంగిరాల సౌమ్య, బోడే ప్రసాద్, కలెక్టర్ బాబు.ఎ, జలవనరులశాఖ కార్యదర్శి శిశిభూషణ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.