ఆంధ్రప్రదేశ్‌

పట్టిసం ట్రయల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూన్ 11: పశ్చిమగోదావరి జిల్లాలో పట్టిసం ఎత్తిపోతల పథకం నుండి శనివారం ఆరు మోటార్లు ఆన్‌చేసి ట్రైల్ రన్ నిర్వహించారు. గత మార్చిలోనే ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయినా గోదావరి నదిలో నీటిమట్టం తక్కువగా ఉండడంతో నీటితో లోడ్న్ చేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 14.01 మీటర్లు ఉండడంతో ట్రైల్ రన్ నిర్వహించారు. గోదావరి నదిలో నీటిమట్టం పెరిగితే ఎప్పుడైనా పట్టిసం ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్‌చేసి కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలించే అవకాశం ఉందని సిఇ విఎస్ రమేష్‌బాబు తెలిపారు. మోటార్లు బిగింపు, పైపులైన్ల నిర్మాణం పూర్తయిన తర్వాత డ్రై రన్ నిర్వహించామని ప్రస్తుతం ఎత్తిపోతల పథకంలోని బావిలోకి గోదావరి నీరు చేరడంతో 1, 2, 3, 4, 5, 10 నెంబర్ల మోటార్లు ఆన్‌చేసి ట్రైల్ రన్ నిర్వహించామన్నారు. మిగిలిన మోటార్లు కూడా రెండురోజుల్లో ట్రైల్ రన్ నిర్వహిస్తామని సిఐ రమేష్‌బాబు తెలిపారు. గతంలో అయిదు అంచెలంచెలుగా మోటార్లు ఆన్‌చేసి గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు సుమారు నాలుగు టిఎంసిల నీటిని తరలించారు. ప్రస్తుతం నీటి మట్టం పెరిగినా నీటిని తరలించే అవకాశం లేదు. జిల్లాలోని పెదవేగి మండలం జానంపేట వద్ద కుడి కాలువలోని అక్విడెక్టు పనులు ఇంకా పూర్తికాలేదు. పది రోజుల్లో ఆ పనులు పూర్తవుతాయని, ఈలోగా గోదావరిలో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ నెల 25న సిఎం చంద్రబాబునాయుడు పట్టిసం ఎత్తిపోతలను సందర్శించి మోటార్లను ఆన్‌చేసే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.

చిత్రం పట్టిసం ఎత్తిపోతలలో ట్రయల్ రన్‌తో డెలివరీ పాయింట్ వద్ద కుడి కాలువలోకి వస్తున్న నీరు