ఆంధ్రప్రదేశ్‌

కొండెక్కిన టమోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూన్ 12: చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో ఆదివారం టమోటా కిలో 80 రూపాయలు పలికింది. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిస్సా, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పాండిచ్చేరి రాష్ట్రాలకు మదనపల్లె మార్కెట్ నుంచి టమోటాలు ఎగుమతి అవుతున్నాయి. ఎక్కువగా తమిళనాడులోని కుంభకోణం మార్కెట్‌కు తరలుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసం వరకు కురిసిన వర్షాలకు ప్రస్తుత వేసవికాలంలో సైతం రైతులకు లాభిస్తోంది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల వ్యాపారులు పోటీ పడుతుండటంతో ధరలు పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో రబీ ముగింపు ఫలితంగా దిగుబడితోపాటు కాయల సైజు తగ్గడంతో అక్కడి వ్యాపారులు మదనపల్లె టమోటాల కోసం పోటీ పడుతున్నారు. జిల్లాలో సుమారు 22.5 వేల హెక్టార్లలో టమోటా సాగు చేస్తుండగా, డివిజన్‌లోనే 17.8 వేల హెక్టార్లు సాగవుతున్నట్లు అధికార గణాంకాలు చెప్తున్నాయి. దిగుబడిలో ఎక్కువ భాగం మదనపల్లె మార్కెట్‌కు రోజుకు కనీసం 300 నుంచి 350 మెట్రిక్ టన్నులు వస్తున్నాయి. మదనపల్లె మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టమోటా కిలో 68 నుంచి 70 రూపాయలు పలుకుతుండగా, దక్షిణాది రాష్ట్రాల్లో కిలో 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. ధరలు అంచలంచెలుగా పుంజుకుంటుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈక్రమంలో ఆదివారం వ్యవసాయ మార్కెట్‌లో పది కిలోల బాక్సు గరిష్ఠంగా 700 రూపాయలు, కనిష్ఠంగా 730 రూపాయలు పలికింది.

chitram మదనపల్లె మార్కెట్‌లో టమోటా