ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడకు మద్దతుగా ఆందోళనలు.. అరెస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 12: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు, పి గన్నవరం మండల కేంద్రాల్లో ఆదివారం ఆందోళనకారులు కదం తొక్కారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌లు అమలులో ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా ఈ రెండు గ్రామాల్లో నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. దీంతో సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. గొల్లప్రోలు తహశీల్దారు కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సుమారు 200 మంది పాల్గొని ముద్రగడకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో గొల్లప్రోలుకు చెందిన ముగ్గురు, తాటిపర్తి గ్రామానికి చెందిన ముగ్గురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే కోనసీమలోని డి గన్నవరం 3 రోడ్ల కూడలిలో కాపు నేతల ఆధ్వర్యంలో ఆందోళనకారులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ గ్రామంలో ఆదివారం ఉదయం నుండి నిరసనకారులు ఆందోళనకు దిగడంతో సి ఆర్‌పి ఎఫ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. మహిళలు ఖాళీ కంచాలు, గరిటెలతో చప్పుడు చేస్తూ ముద్రగడ నిరాహార దీక్షకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమలాపురం డిఎస్‌పి ఎల్ అంకయ్య ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు.
అలాగే రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో ఉదయం కె గంగవరం మండల పరిధిలోని కాపు పట్టు గ్రామాల యువత ఆదివారం తీవ్రంగా స్పందించింది. ఊడిమూడి, సత్యవాడ, సుందరపల్లి తదితర గ్రామాలకు చెందిన కాపు యువత కె గంగవరం చేరుకుని రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ నేతృత్వంలో సిఐ పచ్చా కాశీ విశ్వనాథ్, ఎస్సైలు ఫజుల్ రహ్మాన్, జి నరేష్‌లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కాపు యువత పెద్ద ఎత్తున మోటార్ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమై.. ద్రాక్షారామ సెంటర్‌కు బయలుదేరారు. అయితే పోలీసులు ముందస్తు వ్యూహంతో వారిని అదుపుచేశారు. కాగా రహదారి అడ్డంకులు కల్పించడం, సామాన్య ప్రజాజీవనానికి అవరోధాలు కలిగించడం వంటి చర్యలు చేపట్టిన కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని ద్రాక్షారామ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

chitram గన్నవరంలో రాస్తారోకో చేస్తున్న మహిళలు, ఆందోళనకారులు... గొల్లప్రోలులో ఆందోళనకారులను అదుపుచేస్తున్న పోలీసులు