ఆంధ్రప్రదేశ్‌

ప్రాజెక్టులే నా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పంకన్నా ముందే పులివెందులకు నీళ్లిచ్చాం జన్మభూమి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

ఖాజీపేట (కడప), జనవరి 3: రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.50 వేల కోట్లు కేటాయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించామని, తద్వారా శ్రీశైలంలో మిగులు జలాలను రాయలసీమకు తరలించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. కడప జిల్లా పులివెందులలో బుధవారం నిర్వహించిన జన్మభూమి- మాఊరు సభలో సీఎం మాట్లాడుతూ నీళ్లు తరలించేందుకు ఎంత ఖర్చయినా భరిస్తామన్నారు. వాణిజ్య పంటలకు రాయలసీమ కేంద్రబిందువన్నారు. అందుకే సీమను హార్టికల్చర్ హబ్‌గా చేస్తామని ప్రకటించారు. గాలేరు -నగరి ద్వారా కుప్పంకు నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే అంతకుముందే పులివెందులకు నీరిస్తామని మాట ఇచ్చామని, అదేక్రమంలో మాట నిలుపుకున్నామన్నారు. గండికోట నుంచి చిత్రావతికి నీరు రావడం ద్వారా పంటలు పుష్కలంగా పండించుకోవచ్చునన్నారు. జిల్లాలో రైల్వేకోడూరు మామిడిపండ్లకు, లింగాల చీనీ, దానిమ్మ పండ్లకు మంచి డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19 లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. మూడున్నరేళ్లలో 15 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. 9 లక్షల ఫారం పాండ్స్ తవ్వించడం వల్ల భూగర్భజలాలు పెరిగాయన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 50 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో పక్కాఇళ్ల అవసరం లేదని కొన్ని నివేదికలు కేంద్రానికి పంపడంతో కేంద్రం నిధులు ఆగిపోయాయన్నారు. 21 లక్షల ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం ఇస్తే రాష్ట్రం కొంత ఇచ్చి పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. గత అక్టోబర్‌లో 50 వేల ఇళ్లు పూర్తిచేసి పసుపు, కుంకుమ, రవికెతో నూతన యజమానులతో గృహప్రవేశాలు చేయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. కొత్తగా నిర్మించబోయే 2.50 లక్షల ఇళ్లను సంక్రాంతి నాటికి ప్రారంభించాలనే ఆశయంతో ఉన్నామన్నారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరవు భయమిక లేనే లేదు సీబీఆర్ నుంచి జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
పులివెందుల, జనవరి 3: పులివెందులకు నీళ్లిచ్చాం. ఇక కరవు ఈ ఛాయలకు కూడా రాదని సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను బుధవారం సందర్శించిన సీఎం, సీబీఆర్ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం పీబీఆర్ బ్రాంచ్ కెనాల్ ద్వారా ఎత్తిపోతల పథకంతో పులివెందులకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రైతులనుద్దేశించిన మాట్లాడుతూ రాయలసీమ దేశానికి మణిహారమన్నారు. రైతుల కష్టం తనకు తెలుసునన్నారు. తానూ రైతుబిడ్డనేనని వారి కోసం ఎన్నో పథకాలను
అమలు పరిచామన్నారు. జిల్లాల్లో పండే అరటి దేశం మొత్తానికి తెలిసేలా చేస్తామన్నారు. ప్రాజెక్టుల వద్ద నిద్రించి మరీ పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలోనే లింగాల మండల తలసరి ఆదాయంలో ముందుండాలన్నారు. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గెలువకపోయినా ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టినప్పుడు కృష్ణా, గోదావరి జిల్లాల రైతులను రెచ్చగొట్టి రాయలసీమకు నీళ్లు రాకుండా జగన్ అడ్డుపడాలని చూశారన్నారు. ముఠా రాజకీయాలు ఉన్నాయని తెలిసినా ధైర్యంగా ముందుకు పోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.