ఆంధ్రప్రదేశ్‌

సీపీఎస్ రద్దు కోసం 9న ధర్నా సీఎస్‌ను కలిసి నోటీసు ఇచ్చిన ఎన్జీవో నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 3: కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్) రద్దు చేయాలంటూ ఈ నెల 9న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ నిరసనను ధర్నా రూపంలో తెలియచేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్‌కు పింఛను సాధనా సమితి నోటీసులను బుధవారం అందచేసింది. సీపీఎస్ విధానం వల్ల 2004 సెప్టెంబర్ తరువాత ఉద్యోగంలో చేరిన వారికి, ఉపాధ్యాయులకు పదవీ విరమణ తరువాత పింఛను లభించదని ఎపీఎన్జీవో నేత, జెఏసీఏపీ కన్వీనర్ పి.అశోక్ బాబు తెలిపారు. దీని వల్ల దాదాపు 1.8 లక్షల మంది ప్రభావితం అవుతారని తెలిపారు. పదవీ విరమణ తరువాత పింఛను రాక, జీవిత భద్రత ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాడి డిసెంబర్‌లో వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులతో సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్‌తో పెద్ద సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. సీపీఎస్ అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినదని, దీనిని నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చే వీలు ఉందని గుర్తు చేశారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకం నుంచి బయటకు వచ్చేయాలని కోరుతున్నారన్నారు. ఎన్ని సార్లు ఆందోళన చేసినా, ప్రభుత్వం స్పందించకపోవడంతో ధర్నా కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ వివిధ మండల కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు.