ఆంధ్రప్రదేశ్‌

విలువలతో కూడిన విద్యాబోధన జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 3: విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, అందుకు అనుగుణంగా విలువలతో కూడిన విద్యాబోధన జరగాలని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదాన కార్యక్రమం విశాఖలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దారి చూపేవాడే ఉపాధ్యాయుడని, వారి బాధ్యతలను విస్మరించకుండా ఆదర్శప్రాయం కావాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దగలిగే శక్తి సామర్ధ్యాలు ఉపాధ్యాయునికే ఉన్నాయన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా చక్కటి సమాజం రూపకల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ బడ్జెట్‌లో రూ.23,209 కోట్లను కేటాయించి, విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పాఠశాలల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా రంగంలో జోడించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించగలుగుతున్నామన్నారు. రాష్ట్రంలో గడచిన మూడేళ్ల కాలంలో 30వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని గుర్తు చేశారు. మాజీ రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని, అయితే మహిళా ఉపాధ్యాయులకు కూడా ఒక ప్రత్యేక ఉపాధ్యాయ దినోత్సవం ఉండాలన్న భావనతో దార్శనికురాలు సావిత్రిబాయి పూలే జయంతిని గుర్తించామన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 86 మంది మహిళా ఉపాధ్యాయినులకు ఉత్తమ అవార్డులు ప్రకటించినట్టు తెలిపారు. అవార్డుతో పాటు రూ.10వేల నగదు, రూ.10వేలు విలువచేసే ట్యాబ్, సర్ట్ఫికెట్, బంగారు పతకం, శాలువ బహుకరించారు. సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి జీ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే మీసాల గీత తదితరులు పాల్గొన్నారు.