ఆంధ్రప్రదేశ్‌

వన సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 3: రాష్ట్ర వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంపు.. వన్యప్రాణి సంరక్షణ.. స్మగ్లింగ్ నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఎం మల్లికార్జున రావు తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అడవుల పరిరక్షణకు నాలుగు ప్రత్యేక అవగాహన సదస్సులను జన్మభూమి కార్యక్రమాల్లో నిర్వహిస్తామన్నారు. ‘వనసురక్ష’ కింద ఏపీకే మణిహారంగా ఉన్న ఐదు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవులలో లభ్యమయ్యే ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడం.. వాటిని కాపాడుకోవడం.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అడవులలో ఉత్పత్తి అవుతున్న విలువైన పంటలను కాపాడుకోటవంతో పాటు కార్చిచ్చులు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అంశాలపై ప్రజలను, సిబ్బందిని చైతన్య పరుస్తామని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయటంతో పాటు వన్యప్రాణుల అపహరణ, వధించటం వంటి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా రిజర్వు ఫారెస్టుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ‘వనవికాసం’ కింద నేల సంరక్షణ పనులపై దట్టమైన అటవీ గ్రామాల సమీపంలో ఉన్న ప్రజల్లో అవగాహన కల్పించటం.. అటవీ ప్రాంతాల పునరుద్ధరణ.. భూగర్భజలాలను వృద్ధి చేయటం.. మట్టి క్షీణతను అదుపు చేయటం.. అటవీ అభివృద్ధి.. సహజ పునరుత్పత్తి.. కృత్రిమ పునరుత్పత్తి ద్వారా స్థిరమైన సాగు, సామాజిక అటవీ నర్సరీలలో 2018లో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వనం-మనం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటటం, ప్రజాపంపిణీ కోసం ఇతర విభాగాలకు అందించేందుకు వివిధరకాల మొక్కలు పెంచి వన్యప్రాణి నిర్వహణలో భాగంగా తాబేలు పరిరక్షణ, అడవుల అభివృద్ధి పశుగ్రాసం ప్లాట్లు ఏర్పాటవుతాయని వివరించారు.
‘వనసేవ’లో భాగంగా వైద్య శిబిరాలు, సౌరదీపాల పంపిణీ, బోరుబావులు, కుట్టు యంత్రాల పంపిణీ, సౌరలాంతర్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. చివరగా ‘వన సంపద’ కింద ప్రజలు వినియోగించేందుకు వివిధ అటవీ ఉత్పత్తులకు, అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసీల సంరక్షణకు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ఔషధ మొక్కలు, ఎర్రచందనం, గంధపుచెక్కలు, టేకు, వెదురు సంపదను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.