ఆంధ్రప్రదేశ్‌

భాషా మైనారిటీల ఆలోచనే లేదు లోక్‌సభలో కేంద్ర మంత్రి నఖ్వీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: మైనారిటీల జాబితాలో భాష ప్రాతిపదికన మైనారిటీలను చేర్చే ఆలోచనేదీ కేంద్రం వద్ద లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. లోక్‌సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ, జాతీయ స్థాయిలో మైనారిటీలుగా కేంద్రం ఆరు కమ్యూనిటీలనే గుర్తించిందని వివరించారు. 1992 నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ సెక్షన్ 2(సి) ప్రకారం ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జొరాస్ట్రియన్లు, జైనులు మాత్రమే జాతీయ మైనారిటీల జాబితాలో ఉన్నారని సమధానమిచ్చారు. కొన్ని కులాలకు మైనారిటీలు గుర్తింపు లభిస్తున్నా, అది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమన్నారు. జేవిష్‌లను మైనారిటీల జాబితాలో చేర్చే అంశంపై కేంద్రం ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేన్నారు.
నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహారాష్టల్రో జ్యూస్ కులాలను మైనారిటీలుగా గుర్తిస్తున్నారని, పశ్చిమ బెంగాల్‌లో దీనిపై ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని మంత్రి నఖ్వీ వివరించారు.