ఆంధ్రప్రదేశ్‌

కాల్ సెంటర్ ఓ బ్రహ్మాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 3: ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు జనం అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు కాల్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల చేతుల్లో ఒక బ్రహ్మాస్త్రాన్ని పెట్టారని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన ఐదవ విడత జన్మభూమి-మావూరు కార్యక్రమంలో తొలిసారి మంత్రి హోదాలో లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా రియల్ టైమ్ గవర్నెన్స్‌కు సాంకేతికతను జోడించిన చంద్రబాబుప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారని తెలిపారు. 2014కు మందు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు చీకట్లో ఉండేవన్న ఆయన తెదేపా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత నేడు నిరంతరం గ్రామాల్లో వెలుగులు ఉన్నాయన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా అంటువ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన ఇందుకోసం నిధులను పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. మిషన్ అంత్యోదయలో దేశ వ్యాప్తంగా 83 ఉత్తమ గ్రామాల్లో మన రాష్ట్రం నుండి 33 గ్రామాలు ఎంపికయ్యాయని లోకేష్ తెలిపారు. ప్రభుత్వం చుట్టూ ప్రజలు తిరగాల్సిన రోజులు పోయి, నేడు ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చే రోజులు తెదేపా పాలనలో వచ్చాయన్నారు. రియల్ టైం గవర్నెన్స్‌తో పాటు కాల్ సెంటర్ ద్వారా మీ సమస్య గురించి మీరు ఫిర్యాదు చెయ్యక ముందే తెలుసుకొని పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. లోటు బడ్టెట్‌తో ప్రారంభమైన రాష్ట్రంలో కనీసం తనకు వసతి కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్, పింఛన్ ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు, రైతు, డ్వాక్రా రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నదుల అనుసంధానం చేసిన బాబు ముందు చూపుతో పట్టిసీమ ద్వారా 105 టీఎంసీల నీరు కృష్ణాలోనికి తీసుకు వచ్చి కృష్ణా డెల్టాలోని పంటలను కాపాడారన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో 1044 వ్యాధులకు వైద్యసేవలనందిస్తున్నామన్న లోకేష్ వైద్య సేవలో రెండు లక్షల సీలింగ్ నుండి 2.50 లక్షలకు పెంచి, ప్రజాఆరోగ్యాన్ని కాపాడుతున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రన్న బీమా ద్వారా మరణించిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు అందిస్నున్నట్లు తెలిపారు. క్లోరినేషన్‌తో సురక్షిత నీరు అందించడంతో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్స్ శుభ్రం చేయడం, మరమ్మత్తులకు నిధులు కేటాయించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చడం ద్వారా గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 2019 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నీటి శుద్ధి కోసం ఇంకా మెరుగైన విధానాల కోసం ప్రయత్నిస్తున్నామన్న ఆయన కొన్ని విధానాలను పైలెట్ ప్రాజెక్టుగా చేస్తున్నామన్నారు. గ్రామాల్లో డ్రైనేజి సమస్యలను అధిగమించడంతో పాటు పట్టణాల్లో కూడా లేని అండర్ డ్రైనేజి వ్యవస్థను రాష్ట్రంలోని 157 గ్రామాల్లో నిర్మిస్తున్నామన్నారు. గ్రామాలకు అభివృద్ధిని ప్రోత్సహించేందుకు పది అంశాల ప్రాతిపదికన స్టార్ రేటింగ్స్ ఇస్తామని ప్రకటించారు.
చంద్రబాబు కష్టానికి ఓటు వెయ్యాలి
రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబు కష్టాన్ని చూసైనా రాష్ట్ర ప్రజలు కచ్చితంగా ఓటు వేసి బాబుకు కృతజ్ఞతలు తెలపాలన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరి సంక్షేమం, అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం తన మనువడిని కూడా వదులుకుని శ్రమిస్తున్న చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు మరోసారి భారీ మెజారిటీతో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. సంపాదన, ఆనందంలో మన రాష్టమ్రే ముందుండాలంటున్న చంద్రబాబుకు ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలన్నారు.
ఎడ్లబండిపై లోకేష్ ఊరేగింపు
బాహుబలి చలన చిత్రంలో ఒక యుద్ధ సన్నివేశంలో వినియోగించిన ఎద్దుల బండిపైనే బుధవారం పోరంకిలో మంత్రి నారా లోకేష్‌ను ఉరేగించారు. మహారాష్ట్ర బ్రీడ్‌కు చెందిన ఈ గిత్తలను పోరంకి గ్రామానికి చెందిన దాసరి హరినీడు అనే రైతు సంరక్షిస్తున్నాడు. ఇదే గిత్తలతో ప్రత్యేకంగా అలంకించిన బండిపై మొదటి సారిగా పెనమలూరు నియోజకవర్గానికి వచ్చిన మంత్రి లోకేష్‌ను ర్యాలీగా జన్మభూమి వేదిక వద్దకు ఉరేగింపుగా తీసుకువచ్చారు. పెనమలూరు శాసన సభ్యుడు బోడే ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్రప్రసాద్, బచ్చుల అర్జునుడు, పంచాయితీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, టీడీపీ నేతలు పంచుమర్తి అనూరాధ, దేవినేని చందు, జిల్లా కలెక్టర్ లక్ష్మీ కాంతంతో పాటు సర్పంచ్ వేమూరి స్వరూపారాణి, ఇతర శాఖల అధికారులు, మహిళలు, విద్యార్థులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.