ఆంధ్రప్రదేశ్‌

రిజర్వేషన్ టికెట్ రద్దు చేసుకుంటే మరొకరికి వెసులుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), జనవరి 3: రైలులో టికెట్‌ను రిజర్వు చేయించుకున్న ప్రయాణికుడి బదులు మరో వ్యక్తి ప్రయాణించేందుకు వీలుగా రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రిజర్వేషన్ చేయించుకున్న వ్యక్తి ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే వారి కుటుంబంలోని వ్యక్తి ప్రయాణించే విధంగా వీలు కల్పించింది. ప్రయాణించే వ్యక్తి ఎవరైనా తన రిజర్వేషన్ టికెట్ తన రక్తసంబంధీకులకు బదిలీ చేయవచ్చు. ప్రయాణికుడు ధృవీకరించిన టికెట్ కలిగి ఉంటే అతను, ఆమె ప్రయాణాన్ని రద్దు చేసుకున్న పక్షంలో టికెట్‌ని ప్రయాణికుడి తల్లి, సోదరుడు, సోదరి, కొడుకు, కుమార్తె, భర్త లేదా భార్యతో సహా అతని, ఆమె కుటుంబ సభ్యులకు టికెట్‌ని బదిలీ చేయవచ్చు. టికెట్ బదిలీ కోసం ప్రయాణికుడు ఒక దరఖాస్తు ఫారాన్ని తప్పనిసరిగా రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు తన గుర్తింపుకార్డుతో ప్రధాన రిజర్వేషన్ సూపర్‌వైజరుకు సమర్పించాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వ అధికారులు వారి ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే ఇతర అధికారికి బదిలీ చేయవచ్చు. అలాగే విద్యార్థులకు చెందిన రిజర్వేషన్ టిక్కెట్‌ని ఇతర విద్యార్థులకు బదిలీ చేయవచ్చు. అయితే విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు వారి టికెట్‌ను బదిలీ చేయాలనుకుంటే వారికి చెందిన గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డుల వంటివి తప్పనిసరిగా పొందుపరచవలసి ఉంటుంది.