ఆంధ్రప్రదేశ్‌

హత్యకేసులో 12 మందికి జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూన్ 13: ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్‌లోని అర్థవీడు మండలం బోగోలు గ్రామంలో 2011 జూలై 22న జరిగిన పానుగంటి దావీద్ హత్యకేసులో 12మందికి జీవితఖైదు విధిస్తూ సోమవారం జిల్లా ఆరవ అదనపు జడ్జి శ్రీదేవి తీర్పు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం 2011 ఫిబ్రవరి 26న హతుడు దావీద్ కుటుంబానికి, నిందితురాలు మరియమ్మ కుటుంబానికి మధ్య డ్వాక్రాగ్రూపులకు సంబంధించిన కమీషన్ విషయంలో వివాదం ఏర్పడింది. దీనితో అర్థవీడు పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేసి ఆర్డీఓ కోర్టులో హాజరుపరిచారు. 2011 జూలై 4న ఇరువర్గాలు కోర్టుకు వెళ్లివచ్చిన అనంతరం ఘర్షణకు దిగి దావీద్ కుటుంబంపై గొడ్డళ్లు, కత్తులు, కర్రలతో దాడి చేశారు. దీంతో గాయపడిన దావీద్‌ను కంభం వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. కాగా 2011 జూలై 22న వైద్యం పొందుతూ దావీద్ మృతి చెందాడు. దీనితో అప్పటి అర్థవీడు ఎస్సై రాజశేఖర్ హత్యకేసుగా నమోదు చేయగా, అప్పటి మార్కాపురం సిఐ కె రాఘవేంద్రరావు దర్యాప్తు చేసి ఇరువర్గాల మధ్య పాతకక్షల నేపధ్యంలో ఈ దాడులు జరిగినట్లుగా భావించి నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్షులను విచారించిన నేరం రుజువుకావడంతో జిల్లా ఆరవ అదనపు జడ్జి శ్రీదేవి 12మందికి జీవితఖైదు విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. నిందితుల్లో దుడ్డు లాజర్, ఆసీ, బాలస్వామి, మరియదాసు, మరియమ్మ, శీలం నిర్మల, భారతీ, రాణి, అంబటిపూడి దావీదు, అంబటిపూడి జ్యోతి, దుడ్డు లక్ష్మీ, శీలం వెంకటరావులను దోషులుగా గుర్తించి యావజ్జీవఖైదు విధిస్తూ ఒక్కొక్కరూ 100 రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని, నిందితులను నెల్లూరు జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరుపున ఎం సత్యనారాయణ వాదించారు.