ఆంధ్రప్రదేశ్‌

మెట్రోకు నిధుల కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: విజయవాడ మెట్రోను నిధుల కొరత వెంటాడుతోంది. 2018 నాటికి విజయవాడ మెట్రో పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా, ఇప్పటివరకూ పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. ఇప్పటికిప్పుడు ప్రారంభించినా 2018 నాటికి మెట్రో రైలు పట్టాలెక్కే పరిస్థితి లేదు. హైదరాబాద్ మెట్రోయే ఇందుకు నిదర్శనం. మెట్రో రైలుకు కావాల్సిన బడ్జెట్, భూసేకరణకు అవసరమైన నిధులు మంజూరు కాలేదు. టెండర్లు పిలిచి ఐదు నెలలైంది. ఇప్పటికీ టెండర్లును ఖరారు చేయకపోవడానికి కారణలేంటో అర్థంకావడం లేదు. దీంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ మెట్రో సలహాదారు శ్రీ్ధరన్ ఈవిషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నెల 15న విజయవాడలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం మెట్రోకు 300 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ఇందులో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.