ఆంధ్రప్రదేశ్‌

పింఛనుకు వచ్చి వృద్ధురాలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 13: అగిపోయిన పింఛను పునరుద్ధరించాలని విన్నవించుకోవడానికి కలెక్టరేట్‌కు వెళ్లిన ఒక వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందిన సంఘటన సోమవారం కాకినాడలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన అర్జనపూడి వెంకటలక్ష్మి (70) అనే వృద్ధురాలికి గత ఏడు నెలలుగా ఫించను అగిపోయింది. పిఠాపురం తహసీల్దారు, ఎంపిడిఒకు గోడు వెళ్ళబుచ్చుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో కలెక్టరేట్‌లోనిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తన గోడు వినిపించుకోవడానికి సోమవారం ఆమె కుమారుడితో కలిసి కాకినాడ వచ్చింది. కలెక్టరేట్ ప్రధాన ద్వారం మీదుగా నడిచివెళ్తుండగా ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని గమనించిన అక్కడి వారంతా చెట్టుకింద పడుకోబెట్టి సపర్యలుచేశారు. ఆసమయంలో కలెక్టరేట్‌లో ఒక సమావేశానికి హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య ఆమెను తన కారులో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే వెంకటలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.