ఆంధ్రప్రదేశ్‌

ఆదేశాలు అమలు చేయరేం?: సోమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ , జూన్ 13: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై 11 కేసులు నమోదై వుండటమే కాకుండా ఆయన ఎ-1 ముద్దాయిగా వున్నాడని, ఈ కేసులన్నింటిపై సిబిఐ చార్జ్‌షీట్లు ఫైల్ చేసినప్పటికీ చర్యలు తీసుకోవటంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలోని జిల్లా టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నాడని ఆరోపించారు. మూడు కేసులు నమోదైన వారిపై పోలీస్ శాఖ రౌడీషీట్ తెరవటంతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగిస్తుందని, మరి 11 కేసులున్న జగన్‌ను ఏ యాక్ట్ ద్వారా శిక్షిస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్, శాసనసభ్యులపై ఎలాంటి కేసు ఫైల్ అయినా పదవిలో కొనసాగడానికి అనర్హులని 2003 డిసెంబర్ 16న సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆయనన్నారు. ఈ తీర్పును గౌరవించినట్లయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయడానికే జగన్ అర్హుడయ్యేవాడు కాదన్నారు.