ఆంధ్రప్రదేశ్‌

పన్ను వసూళ్లలో సీమలో అనంత ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, జూన్ 13: రాయలసీమ జిల్లాల్లో 2014-15 ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్లలో అనంతపురం జిల్లా మొదటిస్థానంలో నిలిచిందని మునిసిపల్ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆర్‌డి విజయలక్ష్మి మాట్లాడుతూ గత సంవత్సరం రూ.42 కోట్ల పన్నులు వసూలు చేసి అనంతపురం మొదటిస్థానంలో నిలిచిందన్నారు. జిల్లా వ్యాప్తంగా జూన్‌లో ప్రాపర్టీ, నీళ్లు, ఇతర అన్ని ట్యాక్స్‌లు అన్‌లైన్‌లో బిల్లులు చెల్లించేలా ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంచామన్నారు. 2015లో జిల్లాలో 18 లక్షల మెక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటుచేశామని తెలిపారు. మునిసిపాలిటీల్లో బిల్డింగ్ అప్లికేషన్‌కు అనుమతి నెల రోజుల్లో ఇచ్చేవారని, ప్రస్తుతం ఆన్‌లైన్ బిల్డింగ్ అప్లికేషన్ అన్ని సక్రమంగా ఉన్నట్లయితే 24 గంటల్లో అనుమతి ఇస్తున్నామని తెలిపారు. మునిసిపల్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 102 జివో ప్రకారం 4 జిల్లాల పరిధిలోని 33 మునిసిపాలిటీల్లో జూన్ 20లోపు ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతాయని తెలిపారు.