ఆంధ్రప్రదేశ్‌

నేడు వైకాపా విస్తృత భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: ముఖ్యమంత్రి చంద్రబాబుపై బాణాలు ఎక్కుపెట్టి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన వైకాపా అధినేత వైఎస్ జగన్ తొలిసారిగా విజయవాడలో సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా అధికార పార్టీ టిడిపిలోకి వలసపోవడం, తదనంతర పరిణామాలు, చంద్రబాబు ప్రభుత్వం వైకాపా నేతలపై చేస్తున్న ఎదురుదాడిపై జగన్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. 13 జిల్లాల్లో వైకాపాలో ప్రస్తుతం స్తబ్దత నెలకొంది. ప్రజల్లో వైకాపా పట్ల సానుభూతి ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్‌ను కార్యోన్ముఖుల్ని చేసి ప్రజల మధ్యకు పంపించాల్సిన అవసరం ఏర్పడింది. వచ్చే నెల 8 నుంచి గడపగడపకూ వైకాపా కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలను జగన్ నాయకులకు వివరించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నాయకులతో చర్చించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు.

చిత్రం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న వైకాపా నాయకులు