ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీకి రెండేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జనవరి 12: తూర్పు రాయల సీమ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులురెడ్డికి నెల్లూరు జిల్లా గూడూరు ఫస్ట్ క్లాస్ అదనపు జ్యుడిషియల్ న్యాయమూర్తి లావణ్య రెండేళ్ల జైలు శిక్ష, రూ.4700 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2011 సంవత్సరంలో నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరు గ్రామంలో విఎస్‌ఎఫ్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని అప్పట్లో యండవల్లిపై అభియోగాల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో విధులు నిర్వహిస్తున్న సిఐ రాంబాబును కొట్టి గాయపరచినట్లు నమోదైన కేసుకు సంబంధించి శుక్రవారం ఈ మేరకు విచారణ అనంతరం అభియోగాలు నిర్ధారణ కావడంతో, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డితో పాటు మరో 11 మందికి కూడా రెండేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.4700 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ మేరకు వారిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.