ఆంధ్రప్రదేశ్‌

అవినీతిపై పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 12: అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క భారతీయుడు పోరాడాలని భారత ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో శుక్రవారం జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం నుంచి అవినీతిని అంతమొందించాలంటే ప్రభుత్వాలు, ప్రజల భాగ్యస్వామంతోనే సాధ్యమవుతుందన్నారు. అభివృద్ధికి నిజమైన శత్రువు అవినీతి అన్నారు. స్వామి వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. వారసత్వ రాజకీయాలను ఏ ఒక్కరూ కూడా ప్రోత్సహించరాదన్నారు. లౌకికవాదం పేరుతో కొంత మంది వికృత చేష్టలు చేస్తున్నారని చెప్పారు. అన్ని ధర్మాల్లోకంటే భారత ధర్మం గొప్పదన్నారు. పవిత్రమైన జాతిలో పుట్టిన మనం కులాలు, మతాల పేరుతో చీలికలు పేలికలుగా తయారు కాకూడదన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదన్నారు. వివిధ ప్రాంతాలు, రాజ్యాల పేరుతో విడిపోవటం మంచి కాదని హితవు పలికారు. ప్రపంచం వేగంగా ముందుకు వెళ్తుందని, భారతదేశం కూడా వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఆయన ఆక్షాంక్షించారు. మన దేశానికి, రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయడంతో అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందన్నారు. పాశ్చాత్య వ్యామోహాలతో జీవన విధానాల్లో మార్పులు వస్తున్నాయని, ఇది మంచిది కాదని తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు యువతరానికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. దేశంలో ఉన్న అన్ని రకాల జీవ, ప్రాణులను గౌరవించాలని, అందరినీ సమానంగా చూడాలన్నారు. అప్పడే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొన్ని చోట్ల మహిళలపై అత్యాచారాలు, దేవాలయాలు శిథిలావస్థకు చేరడం, బలహీన వర్గాలపై అంటరానితనం ఉందని, ముందు దాన్ని తరిమికొట్టాలన్నారు. మహిళలను అగౌరవంగా చూడటం మంచిది కాదన్నారు. జన్మభూమిని, మాతృభాషను, కన్నతల్లిని ప్రతి ఒక్కరూ ప్రేమించాలన్నారు. ఎందరో తమ ధన, ప్రాణాలను సైతం కోల్పోయారని, వారి త్యాగ ఫలమే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వరాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కవ సమయం గడపాలన్నారు. కుటుంబ వ్యవస్థను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రక్షణ కల్పిస్తున్న సైనికులను గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భారతీయ పండుగల్లో ఒక సందేశం ఉంటుందన్నారు. కన్నతల్లి, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు మరవరాదని ఆయన సూచించారు. ఈకార్యక్రమానికి ముందు ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడుతో కలిసి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ స్వర్ణ్భారత్ ట్రస్టు ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను పరిశీలించారు. ఈసందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటిల్లో గెలుపొందిన వారికి జ్ఞాపికలు, నగదు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
చిత్రం..సంక్రాంతి సంబరాల్లో ప్రసంగిస్తున్న ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు