ఆంధ్రప్రదేశ్‌

సంక్రాంతి చార్జీల బాదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 13: పండుగ నాడు సొంత ఊళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి గడపాలనుకుంటున్న సగటు మనిషికి ప్రయాణ పాట్లు తప్పట్లేదు. విశాఖ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖ రాకపోకలు సాగించే ప్రయాణికులు రవాణా సదుపాయం లేక పడరాని పాట్లు పడుతున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి కుటుంబం మొత్తం ఊరెళ్లి రావాలంటే రూ.20వేల ఖర్చవుతోంది. ఈ సంక్రాంతికి ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రాగా, ప్రైవేటు సంస్ధలు కూడా దాదాపు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించాయి. దీంతో సొంత ఊర్లకు వెళ్లాలనుకున్న వారికి ఉద్యోగ పరంగా వెసులుబాటు కుదిరింది. అయితే ఊరెళ్దామంటే రవాణా సదుపాయలే గగనమైపోయాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, వ్యాపార, వాణిజ్యాల్లో స్థిరపడిన వారు అధికం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో వలస కూలీలు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఫార్మా, ఐటీ కంపెనీల్లో కూడా తూర్పుకోస్తా ప్రాంతానికి చెందిన వారే అధికం. ప్రతి ఏటా సంక్రాంతికి వీరంతా సొంత ఊర్లకు వచ్చి, కుటుంబ సభ్యులతో గడిపి వెళ్తుంటారు. ప్రతి సంక్రాంతికీ అటూ,ఇటూ రాకపోకలు సర్వసాధారణమే. రవాణా విషయంలో కొంత ప్రతి కూలత ఉన్నా, ఇంత దారుణమైన పరిస్థితితులు ఎప్పుడూ తలెత్తలేదు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ 140 వరకూ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించింది. వీటికి ప్రైవేటు ట్రావెల్స్ నుంచి నడిచే సర్వీసులు అదనం. అయినప్పటికీ ప్రయాణీకుల రద్దీని ప్రత్యేక సర్వీసులు భర్తీ చేయలేకపోతున్నాయి. ప్రయాణికుల అత్యవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ, ప్రైవేటు ఆపరేటర్లు ఛార్జీలను 100 శాతం పెంచేశారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు శనివారం ప్రైవేటు సర్వీసుల్లో రూ.3000 నుంచి రూ.3,200 వరకూ వసూలు చేశారు. ప్రైవేటు ఆపరేటర్లు వ్యూహాత్మకంగా నెల రోజుల ముందే టికెట్ల బుకింగ్ నిలిపివేసి, అత్యవసర వేళ ధరలను పెంచి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక ఆర్టీసీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు చెప్పినప్పటికీ ఛార్జీలు మాత్రం మోత మోగుతోంది. సాధారణ ఛార్జీలతో పోలిస్తే ఆర్టీసీ కూడా ఛార్జీలను 100 శాతం పెంచి వసూలు చేస్తోంది.
ఇదిలా ఉండగా తెలంగాణ నుంచి వచ్చే ప్రయాణికుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. హైదరాబాద్ నుంచి విశాఖకు శుక్ర,శనివారాల్లో ప్రైవేటు సర్వీసుల్లో ఛార్జీలు రూ.3000 దాటింది. ఇక తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రైవేటుకు ఏమాత్రం తగ్గకుండా ఛార్జీలు వసూలు చేసింది. ప్రయాణ పాట్లు పండుగ సంతోషాన్ని సగటు ప్రయాణికునికి లేకుండా చేసిందని చెప్పక తప్పదు.

చిత్రం..కిటకిటలాడుతున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్