ఆంధ్రప్రదేశ్‌

ఒంటికాలిపై ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 13: సంక్రాంతి పండుగతో రైళ్ళ రద్దీ విపరీతంగా ఉంటోంది. కాలేజీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో వీరంతా ఇళ్ళకు బయలుదేరుతున్నారు. దీంతో రైళ్ళన్నీ కిటకిటలాడుతున్నాయి. సుదూర ప్రాంతాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌లు, ప్రత్యేకరైళ్ళు, సూపర్‌ఫాస్ట్‌లు రద్దీగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం, ముంబై-విశాఖపట్నం, ఢిల్లీ-విశాఖపట్నం, హౌరా-చెన్నై, త్రివేండ్రం-హౌరా, భువనేశ్వర్-సికింద్రాబాద్ (విశాఖ), హౌరా-తిరుపతి, బొకారో, కోరమండల్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు మరీ రద్దీగా నడుస్తున్నాయి. వీటిలో సామాన్యులకు బెర్తులు లభించకపోవడంతో దళారీలను ఆశ్రయిస్తున్నారు. అలాగే రిజర్వేషన్ కోచ్‌ల్లో ప్రయాణించే వారికి అదనపు చార్జీల బాదుడు తప్పడంలేదు. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్ళే ప్రయాణికుడు రిజర్వేషన్ సౌకర్యం లేకపోయినా వెయ్యి రూపాయలకు పైగా చెల్లించాల్సి వస్తోంది. అలాగే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి వచ్చే ప్రయాణికులకు రైలు చార్జీల భారం మోయాల్సి వస్తోంది. రెట్టింపు చార్జీలు చెల్లించాల్సి వస్తోందంటూ చెన్నై నుంచి విశాఖ వచ్చిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేశారు. దాదాపు 150 రైళ్ళు విశాఖ మీదుగా నడుస్తున్నా అదనపు కోచ్‌ల సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. గంటల తరబడి ఆలస్యం... రద్దీగా నడుస్తోన్న సూపర్‌ఫాస్ట్‌లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ళు రెండు నుంచి మూడు గంటలపాటు ఆలస్యమవుతున్నాయి. ఏ రైలూ గమ్యానికి సకాలంలో చేరకపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడంలేదు. రైలులోనే కాలం గడిచిపోతోందంటూ హౌరాకు వెళ్తున్న మహిళలు రైల్వేస్టేషన్ అధికారుల వద్ద ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే భువనేశ్వర్, బీహార్, మహారాష్ట్ర, టాటా, అలెప్పీ తదితర సుదూర ప్రాంతాలకు విశాఖ మీదుగా కుటుంబాలతో వెళ్ళే వారూ అవస్థలు పడుతున్నారు. రోజూ రద్దీగా నడిచే గోదావరి, విశాఖ, గరీబ్థ్,్ర దురంతో, ఈస్ట్‌కోస్ట్, జన్మభూమి తదితర ఎక్స్‌ప్రెస్‌ల్లో సామాన్యులకు నిల్చొని కూడా ప్రయాణించే అవకాశం లేకుండా పోతోంది. సంక్రాంతి రోజు వరకు ఇవే పరిస్థితులుంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే రైళ్ళ సమాచారంలోను స్పష్టత లేకపోవడంతో ఎక్కాల్సిన రైలు గురించిన ఆందోళనతో ప్లాట్‌ఫారాలపై పరుగులు తీయాల్సి వస్తోంది. ప్రత్యేక రైళ్ళు, అదనపు కోచ్‌లు సదుపాయం కల్పించకపోవడంతో పలు సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇంటిళ్ళపాది లగేజీలతో వెళ్ళాలంటే భయపడాల్సి వస్తోంది.