తెలంగాణ

ఉద్యోగులకు విధివిధానాలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: అమరావతికి ఉద్యోగులు తరలివచ్చే ప్రక్రియకు కౌంట్‌డౌన్ ప్రారంభమవడంతో ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఉద్యోగుల తరలింపునకు సంబంధించి తాజాగా విధివిధానాలు జారీ చేసింది. సిఎస్ టక్కర్‌తో సోమవారం జరిగిన సమావేశంలో సిఎం చంద్రబాబు క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం సోమవారం రాత్రి పొద్దుపోయాక విధివిధానాలను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్, హెచ్‌ఓడిల్లో ఉన్న ఫైళ్లను తరలించే బాధ్యత ఆయా శాఖల ఉద్యోగులే చూసుకోవాలి. వాటిని పూర్తిస్థాయిలో ప్యాక్ చేయించి, సురక్షితంగా రాజధానికి చేరేవరకూ ఆయా శాఖల్లోని ఉద్యోగులు బాధ్యత వహించాలి. కాగా ఫైళ్లు, ఫర్నిచర్ తరలింపుపై ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. హెచ్‌ఓడి కార్యాలయాల్లో ఉద్యోగుల్లో ఎవరెవరు, ఎప్పుడెప్పుడు వెళ్లాలనే అంశంపై హెచ్‌ఓడిలే నిర్ణయం తీసుకుంటారు. రాజధానికి వచ్చే ఉద్యోగులు అద్దె ఇళ్లలో సెటిలయ్యేవరకూ వేర్వేరు హాస్టళ్లలో ఉంచాలని నిర్ణయించారు. సెక్రటేరియట్, హెచ్‌ఓడిల నుంచి తరలివచ్చే మహిళా ఉద్యోగుల భద్రత బాధ్యతలను గుంటూరు, కృష్ణా జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. అలాగే మగ ఉద్యోగుల బాధ్యతలను ఈ రెండు జిల్లాల కలెక్టర్లు చూసుకుంటారు. ఉద్యోగుల పిల్లలకు స్కూల్ సీట్లకు సంబంధించి ఒక సెల్ ఏర్పాటు చేస్తున్నారు. స్కూళ్లు, కళాశాలల్లో సీట్లు కావాల్సిన ఉద్యోగులు ఈ సెల్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. ఉద్యోగుల ఆరోగ్య సమస్యలపై కూడా ఒక సెల్ ఏర్పాటు చేశారు. ఉద్యోగుల తరలింపులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు సిఎస్ ఆధ్వర్యంలో ఒక సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు.