ఆంధ్రప్రదేశ్‌

హజ్ యాత్రకు 96 శాతం మంది ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 17: ఎపీ స్టేట్ హజ్ కమిటీ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం 2018 హజ్ యాత్రికుల ఎంపికకు డ్రా నిర్వహించింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మహ్మద్ అహ్మద్ షరీఫ్, స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్, హజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నుంచి 316, తూర్పుగోదావరి జిల్లా 41, గుంటూరు జిల్లా 454, కడప జిల్లా 311, కృష్ణా జిల్లా 236, కర్నూలు జిల్లా 533, నెల్లూరు జిల్లా 152, ప్రకాశం జిల్లా 101, శ్రీకాకుళం జిల్లా 5, పశ్చిమగోదావరి జిల్లా నుంచి 46 మంది డ్రాతో నిమిత్తం లేకుండా హజ్ యాత్రకు ఎంపికయ్యారు. 70 ఏళ్లు పైబడిన యాత్రికులు 107 మంది కూడా డ్రాతో సంబంధం లేకుండా ఎంపికయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంకా 99 మంది మిగిలి ఉన్నారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వీరిని అదనపు కోటాలో హజ్ యాత్రకు పంపడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం ప్రతి సంవత్సరం రూ. 15కోట్లు భారీ బడ్జెట్ కేటాయించడం హర్షణీయమని, కడపలో రూ. 12 కోట్ల వ్యయంతో ఇప్పటికే హజ్ హౌస్ నిర్మాణం జరుగుతోందని అహ్మద్ షరీఫ్ తెలిపారు. విజయవాడలోనూ హజ్ హౌస్ నిర్మించడానికి స్థల సేకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్థలం సమకూరగానే ఇప్పటికే విడుదల చేసిన రూ. 24 కోట్లతో వెంటనే అధునాతన హజ్ హౌస్ నిర్మాణ పనులు చేపడతామన్నారు. గన్నవరం విమానాశ్రయంలో రన్‌వే నిర్మాణం పూర్తయిన వెంటనే 2019 హజ్ యాత్రికులను ఇక్కడి నుంచే పంపేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఉపసంహరించుకోవడం వల్ల హజ్ యాత్రికులపై ఎలాంటి ప్రభావం ఉండదని, ప్రతి సంవత్సరంలా పెరుగుతుంది తప్ప సంఖ్య ఏమాత్రం తగ్గదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, అదనపు సెక్రటరీ పి ఉషాకుమారి, హజ్ కమిటీ సభ్యులు ముఫ్తీ మహ్మద్ ఫారూఖ్, వౌలానా ఇలియాస్, మహ్మద్ రఫీ, షేక్ మస్తాన్ షరీఫ్, హాజీ షేక్ హసన్ బాషా, టీ మహబూబ్ సాబ్, షేక్ అక్బర్ సాహెబ్, అబ్దుల్ చిన రెహ్మాన్, సయ్యద్ మఖ్దూమ్ బుఖారి, ఎండీ ఉస్మాన్, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ లియాఖత్ అలీ, హిదాయత్ పాల్గొన్నారు.

చిత్రం..విజయవాడలో హజ్ యాత్రీకుల ఎంపికకు డ్రా తీస్తున్న దృశ్యం