ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్ 2020 నాటికి పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జనవరి 17: గుంటూరు - గుంతకల్లు మధ్య 2020 నాటికి డబ్లింగ్ పనులు పూర్తిచేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. అటు గుంటూరు, ఇటు గుంతకల్లు రెండు వైపుల నుంచి ఒకేసారి డబ్లింగ్ పనులు జరుగుతాయని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్‌లో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గుంటూరు - గుంతకల్లు మధ్య నల్లమల అటవీ ప్రాంతంలో కేవలం 55 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ నెలాఖరు నాటికి వాటిని పూర్తి చేస్తామన్నారు. ఫిబ్రవరి నెలలో ఈ సెక్షన్‌లో విద్యుత్ రైళ్లు నడుపుతామన్నారు. ఈ సెక్షన్‌లో విద్యుత్ రైళ్లు నడపడంతో వాటి వేగం పెరగడమేకాక కొంత సమయం కలసి వస్తుందన్నారు. ఆ సమయాన్ని కొత్త రైళ్లు నడిపేందుకు పరిశీలిస్తామన్నారు. ఈ ఏడాది నవంబర్ నెలలో పార్లమెంటు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారి ప్రతిపాదనలు, డిమాండ్లను ఉన్నతాధికారులకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ఏడాది డిసెంబర్ చివర్లో పార్లమెంటు సభ్యులతో సమావేశం నిర్వహించామని, గుంటూరు డివిజన్‌లో నంద్యాల రైల్వేస్టేషన్ ప్రాధాన్యత రీత్యా మొదటి స్థానంలో ఉందన్నారు. దీనికి తోడు పుణ్యక్షేత్రాలు ఉండడం, టూరిజం అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అందుకే ఈ సెక్షన్‌లో విద్యుత్ రైళ్లు ప్రారంభించిన అనంతరం వారానికి మూడుసార్లు తిరిగే విజయవాడ - ధర్మవరం, ఎక్స్‌ప్రెస్ రైలు, వారానికి మూడు సార్లు తిరిగే మచిలీపట్నం - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రతి రోజు తిప్పేందుకు కృషి చేస్తామన్నారు. అదనపు బోగీలు ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తామన్నారు. గుంటూరు డీఆర్‌ఎం జ్యోతి భూమా, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.