ఆంధ్రప్రదేశ్‌

ఊపందుకున్న పునరావాస ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 17: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో ప్రస్తుతం పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో డిస్ట్రిబ్యూటరీలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో నిర్ధేశిత పనులన్నీ ఈ ఏడాది పూర్తయ్యే విధంగా కార్యాచరణ తీసుకున్నారు. ఈ క్రమంలో పునరావాస, పునర్నిర్మాణ ప్రక్రియ ఊపందుకుంది. నష్టపరిహారానికి సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఈ బిల్లులు అధారిటీకి సమర్పిస్తే తప్ప తదుపరి బిల్లులు వచ్చే అవకాశం లేదు. దీంతో తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నష్టపరిహారానికి సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో పూర్తయ్యే విధంగా దృష్టి సారించారు. మరో వైపు పెరిగిన అంచనాలకు సంబంధించి సీడబ్ల్యుసీ ఎప్పటికపుడు అడిగే వివరాలను సమర్పించడంతోపాటు, పునరావాస బిల్లులు కూడా సకాలంలో సత్వరం పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఒక్క రంపచోడవరం కార్యాలయం పరిధిలోనే పునరావాసానికి సంబంధించి దాదాపు రూ. 2వేల కోట్ల వరకు బిల్లులు సమర్పించాల్సి వుంది.
ప్రస్తుతం పోలవరం డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి భూసేకరణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రధాన కాలువలు, హెడ్ వర్క్సుకు సంబంధించి భూసేకరణ పూర్తయింది. దాదాపు 60వేల ఎకరాల వరకు డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి భూసేకరణ చేయాల్సి వుంది. ప్రస్తుతం దీనిపై దృష్టి కేంద్రీకరించి ఈ ఏడాది చివరి నాటికల్లా పూర్తిచేయాలని కార్యాచరణ తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు మొత్తం 1,65,431 ఎకరాల భూమిని సేకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు 1,05,202 ఎకరాలు సేకరించారు. ఇప్పటి వరకు భూసేకరణ నిమిత్తం రూ.4259 కోట్లు చెల్లింపులు చేశారు. ఇంకా సుమారు రూ.6867 కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా వేశారు. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం చెల్లింపుల మొత్తం అధికమైంది. ప్రాజెక్టు హెడ్ వర్క్సు మాటెలా ఉన్నప్పటికీ పునరావాస, పునర్నిర్మాణ పథకానికే దాదాపు రూ.39 వేల కోట్లకు అంచనా పెరిగింది. ముంపు మండలాలైన విఆర్ పురం, కుకునూరు, చింతూరు, వేలేరుపాడు, కూనవరం, ఎటపాక మండలాల్లో కొత్త చట్టం ప్రకారం భూముల నష్టపరిహారం చెల్లిస్తున్నారు. పునరావాస ప్యాకేజీలో కూడా అంచనాలు పెరగడంతో ప్రస్తుతం చెక్కుల పంపిణీ వ్యవహారం పశ్చిమ గోదావరి జిల్లాకంటే తూర్పులో ఆలస్యానికి కారణమని తెలిసింది. ఇంకా 60228 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి ఇపుడు ప్రత్యేకంగా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని హైరానా పడుతున్నారు. లక్ష్యం మేరకు సాగునీరు అందించాలంటే కేవలం ప్రధాన కాలువలే కాకుండా డిస్ట్రిబ్యూటరీలు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.
మరో వైపు భూమికి భూమిగా కేటాయించేందుకు చర్యలు ఊపందుకున్నాయి. సాగుకు పనికి వచ్చే భూములను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణానికి సంబంధించి 19,426 ఎకరాలు కేటాయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2653 ఎకరాలు సేకరించారు. ఖమ్మం జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాలో కలిపిన మండలాల్లో 5801 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసిన మండలాల్లో 25410 ఎకరాలు సేకరించారు. ఎడమ ప్రధాన కాల్వకు తూర్పు గోదావరి పరిధిలో 6238 ఎకరాలు, కుడి ప్రధాన కాలువకు 8930 ఎకరాలు, విశాఖ జిల్లా పరిధిలో ఎడమ ప్రధాన కాలువకు 4080 ఎకరాలు, కృష్ణా జిల్లా పరిధిలో కుడి ప్రధాన కాలువకు 3476 ఎకరాలు సేకరించారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో భూమికి భూమిగా 83258 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఇందు కోసం రూ.753 కోట్లు ఖర్చు చేశారు. భూమికి భూమిగా మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో పంపిణీ పూర్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇంకా 41,910 ఎకరాలు సేకరించాల్సి వుంది. దీనికి రూ.371 కోట్లు కేటాయించారు. మొత్తం మీద భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు సాగుకు అనువైన భూమిని ఆదివాసీలకు భూమికి భూమి విధానంలో కేటాయించి సత్వరం ముంపు ప్రాంతాల్లో పునరావాసాన్ని పూర్తి చేయాల్సి ఉంది.