ఆంధ్రప్రదేశ్‌

పాదయాత్ర ముగిశాక బీసీ డిక్లరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 17: ఎన్నికల సమయంలో బోయలను ఎస్టీల్లోనూ, రజకులను ఎస్సీల్లోనూ చేరుస్తానని ఘంటాపథంగా చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశాడని, ఇదేనా వెనుకబడిన తరగతులపై ఆయనకున్న ప్రేమ అని వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ చేపట్టిన మహాసంకల్ప పాదయాత్ర 64వ రోజు బుధవారం శ్రీకాళహస్తి, పుత్తూరులో కొనసాగించారు. ఇందులో భాగంగా పాపానాయుడు పేటలో జరిగిన బీసీల ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. రాజకీయాల కోసం కులాలను వాడుకునే సంస్కృతి బాబు పాలనలోనే చూశానని విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగింది వైఎస్ పాలనలోనే అని చెప్పారు. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం, ఆపై చేతులు ఊపడంలో బాబు ఘనుడని ఎద్దేవా చేశారు. ఈక్రమంలోనే సాధ్యం కాదని తెలిసినా వెనుకబడిన సామాజిక వర్గాల్లో ఎస్సీ, ఎస్టీల్లో చేరుస్తానని హామీలు ఇచ్చారన్నారు. బోయలను ఎస్టీల్లో చేరుస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి మోసం చేశారన్నారు. ఇదే అంశంపై మూడుసార్లు తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపారన్నారు. చంద్రబాబు కుల రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని బాబు మాట ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి నియోజక వర్గంలో పెరిక బలిజ కులస్థులతోపాటు అగ్నికుల క్షత్రియులకు ఇటీవల కాలంలో బీసీ సర్ట్ఫికేట్లు ఇవ్వడంలేదని, ఇది ఎంతవరకు ధర్మమని ప్రశ్నించారు. బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రారంభించి ఏటా రూ. 10 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారా, లేదా అని జగన్ సభికులను ప్రశ్నించారు. పాదయాత్ర పూర్తయిన తరువాత బీసీ గర్జన జరిపి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తానన్నారు. కుమ్మరులకు ఎమ్మెల్యేగాగాని, ఎమ్మెల్సీగాగాని అవకాశం కల్పిస్తానన్నారు. అలా కాని పక్షంలో టీటీడీ, శ్రీకాళహస్తి పాలక మండలిలో స్థానం కల్పించి బీసీల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చాటుకుంటానన్నారు. ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండని, మద్యాన్ని రూపుమాపుతానన్నారు. ఆ పనిచేసిన తరువాత రెండోసారి మీ వద్దకు ఓట్ల కోసం వస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య అన్నారు. హాస్టల్స్‌లో ఉండకుండా ఇంటి వద్ద నుంచి విద్యాభ్యాసం చేస్తున్న పిల్లల కోసం ఏడాదికి రూ.25వేలు ఇప్పిస్తానన్నారు. చదువుకునే ఆడ పిల్లలకు ఏడాదికి రూ.15వేలు అందిస్తానన్నారు. 60 ఏళ్ల వృద్ధులకు రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 సంవత్సరాల గృహిణికి రూ.2వేలు పెన్షన్‌గా అందిస్తామన్నారు.

చిత్రం..పాపానాయుడు పేటలో మహిళ నుంచి సమస్యల్ని వింటున్న జగన్