ఆంధ్రప్రదేశ్‌

సాంకేతికాంశాలపై చర్చించాకే త్రైపాక్షిక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 17: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)కు సంబంధించిన సాంకేతిక అంశాలపై అధికారుల స్థాయిలో చర్చించాకే త్రైపాక్షిక సమావేశం నిర్వహిద్దామని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి హరీష్‌రావుకు ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. ఈమేరకు బుధవారం ఆయన హరీష్‌రావుకు లేఖ రాశారు. కృష్ణా వాటర్ డిస్‌ప్యూట్స్ ట్రిబ్యునల్ గతంలో 39.9 టీఎంసీలను కేసీ కెనాల్‌కు విడుదల చేయాలని, అందులో 10 టీఎంసీలు తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేయాలని సూచించిందని తెలిపారు. కేసీ కెనాల్ పరిధిలోని పంటలను కాపాడేందుకు వీలుగా ఈ నీటిని తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేయాల్సి ఉందని లేఖలో తెలిపారు. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా దాదాపు 15 సెంటమీటర్ల మేర ఎత్తు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఎత్తు పెంపు గురించి ప్రస్తావించలేదని గుర్తుచేశారు. ఈనేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల మంత్రులతో త్రైపాక్షిక సమావేశానికంటే ముందు అధికారుల స్థాయిలో చర్చలు జరగాల్సి ఉందన్నారు. ఇందులో సాంకేతిక, హైడ్రోలాజికల్ అంశాలు ఇమిడి ఉన్నాయన్నారు.