ఆంధ్రప్రదేశ్‌

పూరి-తిరుపతి రైలులో పొగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, జనవరి 18: తిరుమల నుండి పూరి వెళ్లే పూరి ఎక్స్‌ప్రెస్ రైలు నుండి పొగలు రావడంతో గురువారం తెల్లవారజామున తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ 2వ నెంబర్ ఫ్లాట్‌ఫాంపై నిలిపివేశారు. రైల్వే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తిరుపతి నుండి బయలదేరిన రైలు చివరి మూడవ బోగీలో రేణుగుంట వద్ద పొగలు రావడం ప్రారంభమై కొద్దిసేపటికి ఆగిపోయాయి. అయితే మళ్లీ రైలు పిఠాపురం వచ్చే సరికి పొగలు రావడం మొదలయ్యాయి. తుని స్టేషన్‌లో రైలులోని విశాఖకు చెందిన ప్రయాణీకులు ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్రేకులు పడటం వల్ల పొగలు రావడం సాధారణ విషయమని, దీనివల్ల ఎటువంటి ప్రమాదం జరగదని అధికారులు చెప్పడంతో అదే బోగీలో వెళ్లగా మరికొంతమంది వెళ్లకుండా ఉండిపోయారు. వీరిని తరువాత వచ్చిన గోదావరి ఎక్స్‌ప్రెస్ ద్వారా విశాఖకు పంపించారు. పూరి ఎక్స్‌ప్రెస్ తునిలో బ్రేక్ డౌన్ చేయడం వల్ల ఆలస్యంగా రైలు బయలుదేరింది.