ఆంధ్రప్రదేశ్‌

విభజన చట్టంలోని 85 శాతం హామీలు అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 20: ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా భారతదేశం ముందుకు దూసుకుపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. శనివారం పుత్తూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నగరి నియోజక వర్గ బూత్ కమిటీ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పెద్దనోట్ల రద్దు, జీ ఎస్టీ అమలు విప్లవాత్మక సంస్కరణలుగా ఆయన అభివర్ణించారు. 17 రకాల పన్నులను సంస్కరించి జీ ఎస్టీని ప్రవేశపెట్టినట్లు వివరించారు. దీని వల్ల పన్నుల ఎగవేతకు అస్కారం ఉండదని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోందని అభిప్రాయ పడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు కేంద్రప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. పదేళ్లలో నెరవేర్చాల్సిన హామీలను మూడున్నరేళ్లలో 85శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన యూనివర్శిటీ, దుగరాజపట్నం పోర్టు, రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు తప్ప మిగిలిన హామీలకు నిధులు, పరిపాలనా అనుమతి మంజూరు చేశారన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కుంభకోణాలు, అవినీతితో విసిగిపోయిన దేశానికి నరేంద్రమోదీ సారథ్యంలో అత్యున్నత పరిపాలన అందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ దేశాలు భారత దేశ ఆర్థిక వ్యవస్థ సాధిస్తున్న విజయాలను ఆసక్తిగా గమనిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు మన దేశంలో అడుగు కూడా పెట్టని ఇజ్రాయిల్ వంటి దేశాధినేతలు మన దేశంతో ఆర్థిక సంబంధాలు నెలకొల్పేందుకు ముందుకు రావడం ప్రధాని సాధిస్తున్న విజయాల పరంపరకు నిదర్శనమని అన్నారు. అవినీతి, ఉగ్రవాద రహిత భారతావని నిర్మాణానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో బిజెపి ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు,బిజెపి మాజీరాష్ట్ర అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..పుత్తూరులో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి అధ్యక్షుడు హరిబాబు