ఆంధ్రప్రదేశ్‌

గణతంత్ర వేడుకలు అదరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: ఈనెల 26న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే గణతంత్ర వేడుకల ఏర్పాట్లను వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో శనివారం మధ్యాహ్నం సమీక్షించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే గణతంత్ర వేడుకల నిర్వహణ బాధ్యతలను కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతానికి అప్పగించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈనెల 25వ తేదీనే విజయవాడ వస్తారని, ఆ రాత్రికి ఇక్కడే బస చేసి, 26వ తేదీ ఉదయం వేడుకల్లో పాల్గొంటారని అధికారులు చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖలవారు 13 శకటాలను ప్రదర్శిస్తారని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ చెప్పారు. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశు సంవర్థకశాఖ శాఖలు, ఆర్టీసీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫైబర్ నెట్, సీఆర్డీఏ, పరిశ్రమలు, వౌలిక సదుపాయాలు, విద్యుత్‌శక్తి, మానవ వనరులు, సర్వశిక్ష అభియాన్, ప్రాథమిక విద్య, అటవీశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, సాంఘిక సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమం, పర్యాటక, సాంస్కృతిక, నీటి వనరులు, ఆరోగ్య, పౌర సరఫరాలు, గృహ నిర్మాణ శాఖలవారు తమ శకటాలను ప్రదర్శిస్తారని ఆయన వివరించారు. టాయిలెట్స్, తాగునీటి సౌకర్యాలను పట్టణ పరిపాలన, నగరాభివృద్ధి సంస్థవారు చూస్తారని అధికారులు చెప్పారు. పాఠశాల విద్యార్థులు, ఎన్‌సీసీ, స్కౌట్ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. స్టేడియంలో ఆరు ట్రాన్స్‌ఫార్మర్స్ ఉన్నాయని, అత్యవసర సమయంలో ఉపయోగం కోసం ఒక జనరేటర్‌ని ఏర్పాటు చేసినట్లు ఏపీ ట్రాన్స్‌కో అధికారి తెలిపారు. మంత్రులకు, ముఖ్యులకు ఆహ్వానాలు పంపుతామని, సమాచార, పౌర సంబంధాల శాఖ వారు ఇచ్చిన జాబితా ప్రకారం మీడియా పాస్‌లు ఇస్తామని ప్రొటోకాల్ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ కల్నల్ ఎం.అశోక్‌బాబు చెప్పారు. అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ, ట్రాన్స్‌పోర్ట్, విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్), రోడ్లు, భవనాల తదితర శాఖల అధికారులు తాము చేస్తున్న పనులను వివరించారు. అధికారులు లేవనెత్తిన పలు సమస్యలకు సీఎస్ పరిష్కారాలను చెప్పారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొర్పోరేషన్ కమిషనర్, హార్టీకల్చర్ అధికారులు చర్చించుకుని ఉద్యానవనం ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, డీజీపీ ఎం.మాలకొండయ్య, సాంఘిక సంక్షేమశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె.కరికాల వలవన్, ఐజీపీ హరీష్‌గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.