ఆంధ్రప్రదేశ్‌

స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్ఫ్‌ర్నేస్-3లో నిలిచిన ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉక్కునగరం, జనవరి 21: ఒక సెక్షన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విశాఖ ఉక్కు కర్మాగారంలోని బ్లాస్ట్ ఫర్నేస్-3 విభాగంలో 24 గంటలు పైగా ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. సమాచారం తెలుసుకున్న వెంటనే సిఎండి మధుసూదనరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులు బ్లాస్‌ఫర్నేస్-3లో ఆదివారం సమస్యను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి పునరుద్ధరణ పనులను చేపట్టాలని విభాగాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి కార్మిక వర్గాలు తెలిపిన వివరాలిలాఉన్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ విభాగంలో సాంకేతిక లోపం కారణంగా శనివారం రాత్రి 8గంటల సమయంలో రెప్పపాటు కాలం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. టీపీపీ విభాగం నుండి బ్లాస్ట్ ఫర్నేస్-3కు అత్యధిక పీడనంతో గాలిని పంపిస్తారు. ఈ గాలి పీడనం తీవ్రత తగ్గింది. దీంతో కోకోఓవెన్, బ్లాస్‌ఫపర్నేస్-3లోని ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే రా-మెటీరియల్ మధ్యలోనే నిలిచిపోయింది. దీనికారణంగా బాస్ట్ఫ్‌ర్నేస్-3లో క్యూయర్ల బ్లాక్ అయి ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. బ్లాస్ట్ ఫర్నేస్-3లోగల అధికారులు, ఉద్యోగులు నిర్విరామంగా పనిచేసి ఆదివారం రాత్రి 8గంటల సమయానికి 23 క్యూయర్లను సిద్ధం చేసి ఉత్పత్తి ప్రక్రియను పునరుద్ధరణ చేశారు.పూర్తిస్థాయిలో పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారానికి మిగిలిన క్యూయర్లను సిద్ధం చేసి ఉత్పత్తిని పునరుద్ధరణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.