ఆంధ్రప్రదేశ్‌

పోలవరం ‘పవర్’ టెండర్లు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 21: ఎట్టకేలకు పోలవరం పవర్‌హౌస్ నిర్మాణ పనులకు టెండర్లు ఖరారయ్యాయి. పోలవరం పవర్‌హౌస్ నిర్మాణ పనులు ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నవయుగ సంస్థకు దక్కాయి. సాంకేతిక బిడ్‌లో అన్ని అర్హతలు ఈ సంస్థకు లభించడంతో పవర్‌హౌస్ నిర్మాణ కాంట్రాక్టు నవయుగ సంస్థకు లభించింది. మార్చిలో పవర్‌హౌస్ కాంక్రీటు పనులు మొదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. పోలవరం హెడ్ వర్క్సులో భాగంగా పోలవరం పవర్‌హౌస్ మట్టి పనులు జరుగుతున్నాయి. కొంతమేర మిగిలినపోయిన మట్టి పనులు కూడా నవయుగకే దక్కాయి. ఏపీ జెన్కో విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను చేపట్టడానికి గత జనవరిలో గ్లోబల్ టెండర్లు పిలిచింది. టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు చేపట్టడానికి దాదాపు ఏడాది పట్టింది. వాస్తవానికి గత మే నెలలోనే పునాది పనులు చేపట్టాలని అంచనావేశారు. కానీ మట్టి పని మందగించింది. ఆఖరికి మిగులు మట్టి పని కూడా పవర్ హౌస్ నిర్మించే నవయుగనే అప్పగించడంతో ఎట్టకేలకు పనులు ప్రారంభమవుతున్నాయి.
పోలవరం హెడ్‌వర్క్సులో మిగిలిపోయిన సుమారు రూ. 1400 కోట్ల అంచనా విలువ కలిగిన మిగులు పనులను టెండర్ల ద్వారా ఇతర సంస్థలకు అప్పగించారు. ఇందులో భాగంగా సుమారు రూ.200 కోట్ల అంచనా విలువైన పోలవరం పవర్‌హౌస్‌లో మిగులు మట్టి పనులను నవయుగకు 6సి కింద పోలవరం ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌స్ట్రాయ్ నుంచి తీసుకుని అప్పగించారు. దీంతో ఇటు పవర్‌హౌస్ నిర్మాణంతో పాటు మిగులు మట్టిపని వెరసి సుమారు రూ.3500 కోట్ల అంచనా విలువైన పవర్‌హౌస్ పనులు నవయుగకు దక్కాయి. ఫిబ్రవరి మొదటి వారం మట్టిపని చేపట్టనున్నారు. ఇంతవరకు ఈ మట్టిపనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్ ఆధ్వర్యంలో త్రివేణి సంస్థ నిర్వహించింది. వాస్తవానికి ఇప్పటికే మట్టిపని పూర్తి కావాల్సివుంది. అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపు దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామాన్ని ఖాళీ చేయించి పోలవరం పవర్‌హౌస్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా కొండను తొలగించాల్సి వుంది. ఈ కొండను తొలగిస్తే తప్ప అసలైన కాంక్రీటు పనులు చేపట్టడానికి అవకాశం లేదు. ఈక్రమంలో నవయుగ సంస్థ ప్రధానమైన కొండ తొలగింపు పనులు, మిగిలిపోయిన మట్టి పనులు పూర్తి చేయనుంది. ఈ పనులు పూర్తయ్యాక అసలు పనులు ప్రారంభం కానున్నాయి. దీనితో మార్చిలో కాంక్రీటు పనులు చేపట్టే అవకాశముంది. కాగా పవర్‌హౌస్‌లో కీలకమైన టర్బైన్లను బిహెచ్‌ఇఎల్‌తో సంయుక్తంగా నవయుగ సంస్థ ఇక్కడే నిర్మాణం చేపట్టనుందని తెలుస్తోంది.
ఎక్కడో తయారైన టర్బైన్లు ఇక్కడకు తీసుకురావడానికి రవాణాలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించడంతో పవర్‌హౌస్ నిర్మాణం స్థలంవద్దే భారీ టర్బైన్లు తయారీకి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ వైపు నిర్మిస్తున్న అండర్ టనె్నల్స్‌ను అనుసంధానం చేసుకుని పవర్‌హౌస్ నిర్మాణ పనులు పూర్తిచేయాల్సి వుంది. ఒక్కోటి 115 మీటర్ల పొడవు కలిగిన మొత్తం 12 టనె్నల్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ టనె్నల్స్ నమూనా అధ్యయనం అనంతరం నివేదికను పవర్‌హౌస్ నిర్మాణానికి అనుసంధానం చేసుకుంటూ నిర్మాణం చేపట్టాల్సి వుంది.
బహుళార్ధసాధక ప్రాజెక్టు పోలవరంలో భాగంగా చేపడుతున్న 960 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా విశేష రీతిలోనే నిర్మాణం కానుంది. అతి తక్కువ ధరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశముండటంతో రాష్ట్ర ప్రభుత్వమే హైడల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణాన్ని చేపట్టింది. అంగుళూరు గ్రామం వద్ద 303 ఎకరాల్లో ఒక్కోటి 80 మెగావాట్ల సామర్ధ్యంతో 12 యూనిట్ల కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ పవర్‌హౌస్‌లో పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు తీసుకుని, విద్యుత్ ఉత్పత్తి తర్వాత గోదావరి నదిలోకి (కాటన్ బ్యారేజి వైపు) నీటిని విడిచి పెడతారు. దీని వల్ల పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేల నుంచే కాకుండా విద్యుత్ కేంద్రం నుంచి కూడా నిరంతరం నీరు కాటన్ బ్యారేజికి చేరుతుంది. 80 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 12 టర్బైన్లలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నిర్మాణ పనులు చేపట్టిన 58 నెలల్లో పూర్తిచేయాలని ఏపీ జెన్కో ప్రణాళిక రూపొందించింది.
మొదటి యూనిట్ 36 నెలల్లోనూ, మిగతా యూనిట్‌లు రెండేసి నెలలకొక యూనిట్ చొప్పున గ్రిడ్‌కు అనుసంధానం చేస్తూ మొత్తం ప్రాజెక్టు 58 నెలల్లో పూర్తి చేయాలని మొదట్లో ప్రణాళిక రూపొందించారు. అనుకున్నట్టుగా పనులు పూర్తికాలేదు కాబట్టి రానున్న రెండేళ్ల కాలంలో కనీసం సగం యూనిట్లయినా పూర్తిచేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విద్యుత్ ప్రాజెక్టు రాష్ట్రానికే తలమానికంగా నిలవడంతోపాటు అతి తక్కువ ధరకు విద్యుత్ లభ్యమవుతుందని ఏపీ జెన్కో పోలవరం సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొలగాని వివిఎస్ మూర్తి అన్నారు.

చిత్రం..పోలవరం పవర్‌హౌస్ నిర్మాణ ప్రాంతం... ఇక్కడ కనిపిస్తున్న కొండను తొలగించాల్సి వుంది