ఆంధ్రప్రదేశ్‌

ఏడాదిలో గండికోటకు పర్యాటక వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 21 : ఏడాదిలోపు గండికోటకు ఊహించని పర్యాటక వైభవం తీసుకొస్తామని రాష్ట్ర మార్కెటింగ్, పశుసంవర్థకశాఖ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లాలోని గండికోట క్షేత్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మంత్రి ఆదినారాయణరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి గండికోట ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆది మాట్లాడుతూ గండికోటను భానుకొండల్లో 900 ఏళ్ల క్రితం నిర్మించారన్నారు. కోటకు కొద్ది మైళ్ల దూరంలో చుట్టూ అగస్తేశ్వరకోన, గుర్రప్పకోన, కన్యతీర్థం వంటి 8 కోనలు, గండికోట ప్రాజెక్టు ఉన్నాయన్నారు. అగస్తేశ్వరకోన నుంచి గండికోట మీదుగా గండికోట ప్రాజెక్టు వరకూ ఈ కొండల్లో రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. కోటకు పక్కనే ఉన్న గండి లోయ మీదుగా అవతలి కొండలపైకి వెళ్లేందుకు రోప్‌వేను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు రూ. 7.5కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ ప్రాంతంలో త్వరలో స్టీల్‌ప్లాంట్ కూడా రాబోతోందన్నారు. జిల్లాలో సిద్దవటం కోట, కడపలో పెద్దదర్గా వంటి దర్శనీయ స్థలాలు ఉన్నాయన్నారు. ఒంటిమిట్టను భద్రాద్రి కంటే ఘనంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు సహకరిస్తున్నారన్నారు. గండికోట చుట్టూ పర్యాటక నిర్మాణాలన్నీ పూర్తయితే కడప జిల్లా ఒక మంచి పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. కడప జిల్లాను ఫ్యాక్షన్ గడ్డ కాదు, ఫ్యాషన్ గడ్డ అనుకునేలా చేస్తామన్నారు. గండికోట ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీరు వదిలిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. అలాగే దేశంలో వెనుకబడిన 150 జిల్లాల్లో కడప జిల్లాను చేర్చినందుకు ప్రధాని మోదీకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గండికోటలో నివశిస్తున్న 150 కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి కోట వెలుపల ప్రభుత్వమే మంచి ఇళ్లు నిర్మించి ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. ఇక పాత్రికేయులకు జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన కలెక్టర్‌ను ఆదేశించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.లింగారెడ్డి మాట్లాడుతూ గోల్కొండ కోటను 420 సంవత్సరాల క్రితం నిర్మిస్తే గండికోటను 900 ఏళ్ల క్రితమే నిర్మించారన్నారు. ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పంతో ఉందని, ఇక్కడికి వచ్చిన వారంతా తమకు తెలిసిన వాళ్లందరికీ కోట గురించి చెప్పాలన్నారు. సినీనటి ప్రజ్ఞాజైశ్వాల్ తెలుగులో రెండు మాటలు మాట్లాడి ఒక సినిమా పాట పాడి సభికులను అలరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి ఆదితో పాటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చైర్మన్ ఎం.లింగారెడ్డి, కలెక్టర్ టి.బాబూరావునాయుడు, జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, జేసీ-2 శివారెడ్డి, పర్యాటకశాఖ రీజినల్ డైరెక్టర్ గోపాల్ పాల్గొన్నారు.
కోట పాలకుల వారసులు హాజరు
గండికోటను పాలించిన పెమ్మసాని వంశానికి చెందిన కొందరు వారసులు, ఆ తర్వాత కాలంలో పాలించిన నంద్యాల రాజుల వంశీకులు గండికోట ఉత్సవాలకు హాజరయ్యారు.

చిత్రం..కళాకారులతో కలెక్టర్ బాబూరావునాయుడు, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి, జాయింట్ కలెక్టర్ శే్వత, ఇతర అధికారులు