ఆంధ్రప్రదేశ్‌

సింహ భాగం ఖర్చు కేంద్ర ప్రభుత్వానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, జనవరి 22: రాష్ట్రప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సింహ భాగం నిధులు విడుదల చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధ్రీరి అన్నారు. కృష్ణాజిల్లా నందిగామ గాంధీ సెంటర్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనాయకుడు మండవ భవానీ శంకర్ (నాని) అట్టహాసంగా బీజేపీలో చేరగా పురంధ్రీశ్వరి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారు కేదార్‌నాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత మహాత్మాగాంధీ, నందమూరి తారక రామారావు విగ్రహాలకు పురంధ్రీశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో తెలుగువాడి గొప్పతనాన్ని తెలియజేస్తూ నారాయరెడ్డి రాసిన కవితను వల్లెవేసిన పురంధ్రీశ్వరి మాట్లాడుతూ ఇక్కడ బీజేపీకి పునాదే లేదు అని విమర్శించే వారికి ఈ బహిరంగ సభే ఒక చెంప పెట్టులాంటిదన్నారు. వారసత్వ రాజకీయాలు లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని, పార్టీ గొప్పతనాన్ని వివరిస్తూ పార్టీలో అంకితభావంతో పని చేసే వారు ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండానే ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఈ పార్టీలో ఉందన్నారు. అందుకు ఉదాహరణ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలేనని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్త, నాయకుడికి సైతం పెద్ద పీట వేసేది బీజేపీయేనని అన్నారు. గత ఎన్నికల్లో రాజకీయ విశే్లషకుల అంచనాలకు భిన్నంగా 282 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకొని ఏ రాజకీయ పార్టీ మద్దతు అవసరం లేకుండానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పార్లమెంట్‌కు అడుగు పెట్టిన సందర్భంలో ఎటువంటి గర్వాన్ని ప్రదర్శించకుండా తాను ఈ దేశ ప్రధాన సేవకుడిని అని చెప్పుకోవడం గమనించాల్సిన విషయమన్నారు. పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక సంక్షేమ పథకాల్లో సింహ భాగం నిధులు కేటాయించేది కేంద్ర ప్రభుత్వమే అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.15వేలు ఖర్చు అవుతుండగా అందులో రూ.12వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా రూ.3వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు.జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని, అదే విధంగా ప్రతి పేద వాడి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందేందుకు ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.