ఆంధ్రప్రదేశ్‌

12 మంది ఐపీఎస్‌లు, ఐదుగురు ఐఏఎస్‌లకు ప్రమోషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 22: రాష్ట్రంలో పని చేస్తున్న 12మంది ఐపీఎస్ అధికారులతోపాటు, కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న మరో ఐదుగురు ఐఏఎస్‌లకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఆరుగురు ఎస్పీలకు సీనియర్ అధికారులుగా, నలుగురు డీఐజీలకు ఐజీలుగా, మరో ఇద్దరు సీనియర్లకు డీఐజీలుగా ప్రమోషన్ లభించింది. 2004 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ హోదాలో ఉన్న విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ కాంతి రానా టాటా, కోస్తల్ సెక్యూరిటీ ఎస్పీ డాక్టర్ నవీన్ గులాటి డీఐజీలుగా పదోన్నతి పొందారు. అదేవిధంగా 2000 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గుంటూరు రేంజ్ డీఐజీ కేవీవీ గోపాలరావు, విజయవాడ జాయింట్ పోలీసు కమిషనర్ బీవీ రమణకుమార్, ఏసీబీ అదనపు డైరెక్టర్ పి హరికుమార్, అదేవిధంగా బెంగళూరులో సీబీఐలో పని చేస్తున్న మనీష్‌కుమార్ సిన్హాలకు డీఐజీ హోదా నుంచి ఐజీలుగా పదోన్నతి కలిగింది. ఇక..పలుచోట్ల విధులు నిర్వహిస్తున్న ఎస్పీలు ఎస్ శ్యాం సుందర్, డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ, కె కోటేశ్వరరావు, ఎల్‌కెవి రంగారావు, పి వెంకటరామిరెడ్డి, జి పాలరాజులకు సీనియర్ ఎస్పీలుగా ప్రమోషన్ దక్కింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వివిధ చోట్ల పని చేస్తున్న ఐదుగురు ఐఏఎస్ అధికారులకు కూడా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 2005 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముదావత్ ఎం నాయక్, తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి భాస్కర, 2002 బ్యాచ్‌కు చెందిన సివిల్ సప్లయిస్ డైరెక్టర్ జి రవిబాబు, 2005 బ్యాచ్‌కు చెందిన భారత ప్రభుత్వ రూరల్ డవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీ ఎం జానకి, భారత ఉప రాష్టప్రతి ప్రైవేటు సెక్రటరీ ఎన్ డాక్టర్ ఎన్ యువరాజ్‌లకు సీనియర్ ఐఏఎస్ అధికారులుగా పదోన్నతి లభించింది.