ఆంధ్రప్రదేశ్‌

ప్రతి రైతుకు మద్దతు ధర ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: దావోస్ వెళ్తూ కూడా ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి మార్గదర్శకాలు ఇచ్చారని, ప్రతి రైతుకు మద్దతు ధర లభించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం వ్యవసాయం, నీరు-మీరు పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లు, శాఖాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం సేకరణపై చర్చ జరిగిన విషయం ప్రస్తావించారు. ‘ ధాన్యం సేకరణ కేంద్రాలపై జిల్లాల కలెక్టర్లు నిశితంగా దృష్టి పెట్టాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. ప్రతి రైతుకు మద్దతు ధర లభించేలా శ్రద్ధ వహించాలని’ ఆదేశించారు. ధాన్యం సేకరణపై మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చిన విషయం ప్రస్తావించారు. కృష్ణాజిల్లాలో జరుగుతున్న ధాన్యం సేకరణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రయోజనం కలిగించేందుకే ధాన్యం సేకరణ కేంద్రాలు పెట్టామని, వాటిని రైస్‌మిల్లర్లు, దళారులు దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత జిల్లాల యంత్రాంగంపైనే ఉందని అన్నారు. రీ-సైక్లింగ్ బియ్యం ధాన్యం సేకరణ కేంద్రాలకు తెచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ బియ్యం రైస్ మిల్లుల్లో రీ-సైక్లింగ్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆయా రైస్‌మిల్లుల్లో గత రెండు నెలల విద్యుత్ వినియోగం లెక్కలు తీయడం ద్వారా ధాన్యం రీ-సైక్లింగ్‌కు అడ్డుకట్ట వేయాలన్నారు. ఖరీఫ్‌లో పంట రుణాల పంపిణీ సంతృప్తిగా జరిగిందంటూ, రబీలో కొన్ని జిల్లాల్లో పంట రుణాల పంపిణీ మందకొడిగా జరగడంపై దినేష్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, కర్నూలు, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో పంట రుణాల పంపిణీ వేగంగా జరగాలని సూచించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కౌలు రైతులకు పంట రుణాల పంపిణీ మరింత వేగం పుంజుకోవాలని ఆదేశించారు. ఉద్యాన రంగంలో సూక్ష్మసేద్యం లక్ష్యం సగం మాత్రమే చేరారంటూ, మిగిలింది కూడా 3 నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ ఏడాది టార్గెట్ 2,06,5009 హెక్టార్లకు గాను లక్షా 12వేల హెక్టార్లలోనే జరిగిన విషయం గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న పండ్ల తోటల సాగును 41లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి టార్గెట్ పెట్టిన విషయం ప్రస్తావించారు. రాయలసీమ జిల్లాల్లో మైక్రో ఇరిగేషన్‌ను మరింత ప్రోత్సహించాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సంఖ్య అధికంగా ఉన్న దృష్ట్యా బోట్లు, వలలు మరిన్ని కేటాయించాలని కలెక్టర్ ధనుంజయరెడ్డి కోరగా కార్పోరేషన్ల ద్వారా వాటిని అందజేయాలని సూచించారు. ఈ వారం పంట కుంటల తవ్వకం 500 మాత్రమే జరిగాయని, రాబోయే 4నెలలు చురుకుగా పనులు చేసి టార్గెట్ చేరుకోవాలని ఆదేశించారు. చెరువులు, కాలువల గట్లపై కంప నరికివేత పనులు ముమ్మరం చేయాలన్నారు. అన్ని జిల్లాల్లో 2016-17 ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. 2017-18 ఇళ్ల మంజూరు లక్ష్యాన్ని వెంటనే చేరుకోవాలన్నారు.
ఎన్టీఆర్ గ్రామీణ్ హౌసింగ్ లక్ష్యాలపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. ‘నరేగా పనులకు జిల్లాల కలెక్టర్లే నేతృత్వం వహించాలి, వ్యక్తిగతంగా పనుల పురోగతిని పర్యవేక్షించాలి, ఎప్పటికప్పుడు సమీక్షించాలని’ స్పష్టం చేశారు. నరేగాలో మెటీరియల్ కాంపోనెంట్ పనులు 40 శాతానికి మించిరాదన్నారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లేబర్ కాంపోనెంట్ పెంచాలని సూచించారు. రాబోయే రెండు నెలలు ఎన్‌ఆర్‌ఎం కార్యక్రమాలపై దృష్ట్ర కేంద్రీకరించాలన్నారు. గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 50 శాతం సహజ వనరుల నిర్వహణ కార్యక్రమాలు జరగడం పట్ల తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షల ద్వారా ఎన్‌ఆర్‌ఎం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి కూలీలకు సకాలంలో చెల్లింపులు జరపాలని, 7 రికార్డులు పక్కాగా నిర్వహించాలని మార్గదర్శకం చేశారు. కాగా జన్మభూమి-మావూరులో వచ్చిన వినతుల పరిష్కారంపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని దినేష్‌కుమార్ ఆదేశించారు. ఆర్థికేతర వినతులు అన్నింటినీ జనవరి 31లోపు పరిష్కరించాలన్నారు. మరో 8 రోజుల్లో అర్జీలన్నింటినీ పరిష్కరించాలన్నారు. ఆర్థికపరమైన వినతులను అర్హతను బట్టి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి నిర్దేశ్చింన లక్ష్యాలను ప్రతి శాఖ, ప్రతి జిల్లా చేరుకోవాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఉద్యానశాఖ, మత్స్యశాఖల ఉన్నతాధికారులు చిరంజీవి చౌదరి, రాంశంకర్ నాయక్, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖల కమిషనర్లు రామాంజనేయులు, హరి జవహర్ లాల్, జలవనరుల చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి అరుణ్‌కుమార్, పశు సంవర్ధకశాఖ నుంచి సోమశేఖర్, ముఖ్యమంత్రి కార్యాలయం సహ కార్యదర్శి రాజవౌళి, ఇతర అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.