ఆంధ్రప్రదేశ్‌

ఆర్థికేతర విజ్ఞప్తులన్నీ నెలాఖరులోగా పరిష్కరించాలి: సీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: ప్రజల నుండి వచ్చిన విజ్ఞాపనలు, అర్జీలలో ఆర్థికేతరమైన అంశాలకు సంబంధించిన అర్జీలన్నిటినీ జనవరి నెలాఖరులోగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఫిర్యాదుల పరిష్కారంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞాపనలను సకాలంలో పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా జన్మభూమి, జన్మభూమికి ముందు ప్రజల నుండి వచ్చిన అర్జీలను ఆర్థిర్ధిక, ఆర్థికేతరమైన వాటిగా విభజించి వాటిలో ఆర్థికేతరమైన విజ్ఞాపనలన్నిటినీ ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి వెంటనే అందరు జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖాధికారులకు డీఓ లేఖ రాయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. వచ్చిన అర్జీల్లో ఆర్థిక, ఆర్థికేతర విజ్ఞాపనలు వేరుచేయడమే గాక మరలా వాటిలో వ్యక్తిగత,సామాజికపరమైన వాటిని విభజించి వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత, సామాజికపరమైన అంశాలకు సంబంధించిన ఆర్థికపరమైన విజ్ఞాపనలను జిల్లా, శాఖల వారీగా విభజించి వాటి పరిష్కారానికి ఎంత మొత్తం నిధులు అవసరం ఉంటుందో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంపై తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని స్పష్టం చేశారు. ఫిర్యాదులన్నిటినీ సకాలంలో పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రత్యేక కార్యదర్శి పివి చలపతిరావు, ప్రణాళికా శాఖ సంచాలకుడు గోపాల్, రియల్ టైమ్ గవర్నెన్స్ డైరక్టర్ ఎ.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.