ఆంధ్రప్రదేశ్‌

మత్స్యకారులను షెడ్యూల్ ఫిషర్‌మెన్‌గా గుర్తించాలి: వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: మత్స్యకారులనుల ఎస్సీ,ఎస్టీల మాదిరి ఎస్‌ఎఫ్ (షెడ్యూల్ ఫిషర్‌మెన్)గా గుర్తించాల్సిందేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. గత నెల రోజులుగా తమను మత్స్యకారులు ఎస్టీలుగా గుర్తించాలని చేస్తున్న ఉద్యమానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ మేరకు మంగళవారం విశాఖలో పర్యటించిన ఆయన మత్స్యకారుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఏడు శాతం మత్స్యకార, ఉపకులాలు ఉన్నాయన్నారు. రాజ్యాంగంలోని 331,332 షెడ్యూళ్ల ప్రకారం ఎస్సీ,ఎస్టీలకు చట్టసభలు, విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తు చేశారు. అదే మాదిరి మత్స్యకారులను కూడా షెడ్యూల్ వర్గంగా గుర్తించి అన్ని రిజర్వేషన్లు వర్తింపచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మత్స్యకారులను ఎస్‌ఎఫ్‌గా గుర్తించాలని కోరుతూ పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టేందుకు వైసీపీ చొరవ తీసుకుంటుందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రైవేటు బిల్లు పెట్టేందుకు పార్టీ అధినేత జగన్‌మోహన రెడ్డి అంగీకరించారన్నారు. మత్స్యకారులకు రిజర్వేషన్లు అమలైతే అసెంబ్లీలో 15 మందికి, పార్లమెంట్‌లో ఇద్దరికి రాష్ట్రం నుంచి అవకాశం లభిస్తుందన్నారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరమని, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే మత్స్యకారులను ఎస్‌ఎఫ్‌లుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ అధికారంలోకి వస్తేనే మత్స్యకారుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. చంద్రబాబును కలిసిన మత్స్యకార నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..శిబిరంలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి