ఆంధ్రప్రదేశ్‌

మోదీ మళ్లీ వస్తే దేశానికి విపత్తే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 23: రానున్న ఎన్నికల్లో మోదీని ప్రజలు తిరస్కరించకపోతే దేశానికి విపత్తేనని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పెద్ద నోట్ల రద్దువల్ల దేశ జీడీపీ పెరిగిందని ప్రధాని మోదీ బలవంతంగా చెప్పిస్తున్నారని ఆర్థిక గణాంక శాస్తవ్రేత్త సుబ్రహ్మణ్యస్వామి చెప్పడాన్ని బట్టి చూస్తుంటే దేశానికి మోదీ చాలా ప్రమాదమనే విషయం తెలుస్తోందన్నారు. 2019 ఎన్నికల్లో మోదీని నియంత్రించకపోతే 2024 నాటికి ఎన్నికల్లేకుండా చేసేస్తారన్నారు. మోదీకి దాసోహం అనకపోతే కనీస పరిపాలనే జరగనివ్వరని, రాజ్యం వీరభోజ్యం అనే ధోరణితో వ్యవహరిస్తారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు. బీజేపీతో కలిసే ఏ పార్టీకి తాను ఓటెయ్యబోనన్నారు. ఏపీలో ఇప్పట్లో కాంగ్రెస్‌కు ఛాన్స్‌లేదన్నారు. విశ్వసనీయత వేరు, ద్వేషం వేరని, కాంగ్రెస్‌పై ఏపీ ప్రజలు ద్వేషం పెంచుకున్నారని, విభజన పరిణామాల్లో బీజేపీ తప్పించుకుందన్నారు. విభజన హామీలు అమలుకావడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగేళ్లకు స్పందించారని ఉండవల్లి ఎద్దేవాచేశారు. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామంటోన్న చంద్రబాబునాయుడు ముందు రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎవరివల్ల అన్యాయం జరిగిందో చెప్పకుండా కోర్టుకెక్కితే అపరాథ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. సిఎం పక్కన కూర్చుని మరీ ప్రత్యేక హోదా ఎందుకని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అనడం చాలా దారుణమని, ప్రతిపాదనవస్తే పరిశీలిస్తామని చెప్పడాన్ని బట్టి చూస్తుంటే అసలు ఇప్పటి వరకు ప్రత్యేక హోదా గురించి ప్రతిపాదనే వెళ్ళలేదా అనే అనుమానం కలగకమాదన్నారు. వాతావరణాన్ని బట్టే ఐటి కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్‌లలో అభివృద్ధి చెందాయని, అటువంటి వాతావరణాన్ని వదిలేసి ఐటి కంపెనీలు కోస్తాకు ఎందుకొస్తాయన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల హెరిటేజ్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉందని, ఆ సంస్థ తెలంగాణాకు పన్ను చెల్లిస్తోందన్నారు. టెండర్లు పిలవకుండా పోలవరం పనులు నవయుగ సంస్థకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. 60 సి ప్రకారం ట్రాన్స్‌స్ట్రాయ్‌ని మార్చాల్సిందేనని సిఎం పట్టుబడితే అదే రేట్లకు పనిచేసేందుకు ఎవరు ముందుకొస్తారని గడ్కరీ ఒప్పుకోలేదని, ఇపుడు అదే రేట్లకు నవయుగకు కట్టబెట్టారంటే కేంద్ర మంత్రి గడ్కరి చెప్పిందే నిజమైందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతిస్తామని జగన్ చెప్పడం దారుణమన్నారు. జగన్ కేంద్రంపై పోరాటం చేయకుండా కేవలం టీడీపీ మీదే పోరాటాన్ని సాగిస్తున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పి, అదికూడా ఇవ్వని కేంద్రంతో జగన్ ఎలా కలుస్తారని వ్యాఖ్యానించారు. మోదీ ఎటూ ప్రత్యేక హోదా ఇవ్వరనే ఉద్దేశ్యంలో జగన్ ఉన్నారేమోనన్నారు. 2019 ఎన్నికల్లోపు ప్రత్యేక హోదా ప్రకటిస్తే బీజేపీతో జగన్‌కు రహస్య ఒప్పందం ఉందన్న చంద్రబాబు ఆరోపణ నిజం అవుతుందన్నారు. జగన్ బీజేపీతో కలిస్తే రాష్ట్రానికి మంచా..చెడా అనేది కాలమే నిర్ణయించాలన్నారు.