ఆంధ్రప్రదేశ్‌

దమ్ముంటే బహిరంగ చర్చకు రా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 23: దళితులకు మీరేం చేశారో..మా ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగ చర్చలో తేల్చుకుందాం..దమ్ముంటే రా!.. వేలాది ఎకరాల దళితుల భూములు కాజేసి వాస్తవాలను వక్రీకరిస్తావా.. ఖబడ్దార్..ఇకపై నీ ఆటలు సాగవని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు సవాల్ విసిరారు.. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నక్కా తీవ్రంగా స్పందించారు. మంగళవారం రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాం నుంచి వైఎస్ వరకు చేసిన అభివృద్ధి.. ఇప్పుడు జరుగుతున్నదానిపైనా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇడుపులపాయలో జగన్ తండ్రి వైఎస్, తాత రాజారెడ్డి దళితుల భూములను కబ్జా చేసింది నిజంకాదా అని ప్రశ్నించారు. అదేమని ప్రశ్నిస్తే వారిని వేధింపులకు గురిచేశారని, బండారం బయటపడిన తరువాత దళితుల భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నట్లు శాసనసభలో వైఎస్ ప్రకటించారని గుర్తుచేశారు.
మీకు బాబుకు పోలికనా!: మంత్రి జవహర్
వైఎస్ హయాంలో చేసిన మోసాలు, అన్యాయాలు, దారుణాలను దళితులు గ్రహించటంతోపాటు నేడు చంద్రన్న ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం వైపు వస్తున్నందుకే మరోసారి దళితులను మోసం చేయడానికి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత జగన్ దుష్ప్రచారానికి పూనుకున్నారని మంత్రి జవహర్ ఆరోపించారు. ‘ మీ కుటుంబానికి, బాబు కుటుంబానికి పోలికే లేదు, అడుగడుగునా దళితులను దగా చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిది. బెదిరించి, బాధించి, వేధించి దళితుల భూములను లాక్కొన్న చరిత్ర వైఎస్ కుటుంబానిదే. నేటికీ ఇడుపులపాయలో మీ కుటుంబం అధీనంలో బినామీ పేర్లతో అసైన్డ్ భూములున్నాయి. మీ కుటుంబం అధీనంలో ఉన్న అసైన్డ్ భూములను దళితులకు అప్పగించి వారికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పి మాట్లాడాలి’ అని మంత్రి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి జవహర్ బహిరంగ లేఖ రాశారు.
ఆ అసైన్డ్ భూములు దళితులకు అప్పగించండి
పాదయాత్రలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి దళిత సమావేశంలో ఆవేశంగా మాట్లాడుతూ దళిత కుటుంబాల్లో వెలుగు నింపుతానని కపట ప్రేమ వలకబోస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డిగాని, ఆయన తండ్రి వైఎస్ గాని, వారి కుటుంబాలకు గానీ ఎవరికీ దళితుల మీద ప్రేమ లేదన్నారు. ఇడుపులపాయ ఎస్టేట్‌లో, ఇతర ప్రాంతాల్లో జగన్ కుటుంబం ఆధీనంలో ఉన్న దళితులకు సంబంధించిన ఎసైన్డ్ భూములు ఇంతవరకు పూర్తిగా ప్రభుత్వానికి ఎందుకు స్వాధీనపరచలేదని ప్రశ్నించారు. ఇప్పటికీ 400 ఎకరాలు దళితులకు చెందిన అసైన్డ్ భూములు మీ ఆధీనంలో ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 710 ఎకరాలు ఇడుపులపాయలో అసైన్డ్ భూములున్నాయని మీ తండ్రి ముఖ్యమంత్రిగా శాసనసభలో ప్రకటన చేసి క్షణంలోనే మాటమార్చి 310 ఎకరాలు మాత్రమే ప్రభుత్వానికి స్వాధీనం చేసింది నిజం కాదా? నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా దళితులపై ప్రేమ ఉంటే మీరిప్పటికీ అనుభవిస్తున్న 400 ఎకరాల అసైన్డ్ భూములు ప్రభుత్వానికి స్వాధీనపరచి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
వైసీపీకి, జగన్‌కు రాజకీయ విలువల్లేవ్: అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం: ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి పనిచేస్తానన్న వైసీపీ నేత జగన్‌కు, ఆ పార్టీకి రాజకీయ విలువల్లేవని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూ ప్రజలను మభ్యపెడుతున్న జగన్ ముందుగా వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. మంగళవారం ఇక్కడి జెడ్పీ సమావేశ మందిరంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఓటింగ్‌లో ఓటు వేయాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రోజుల్లో ఎందుకు మెలిక పెట్టలేకపోయారని ప్రశ్నించారు. అలాగే, హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ఎందుకు వెనకడుగు వేసారని మరో ప్రశ్న సంధించారు. మాట వరసకు కూడా స్పెషల్ స్టేటస్ కావాలని అడగని జగన్ ఇప్పుడు ఇలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌కు అన్ని దారులూ మూసుకుపోయాయని, పార్టీలో నేతలంతా వెళ్ళిపోతుండటంతో అతనికి భయం పట్టుకుందన్నారు. పార్టీని నిలబెట్టుకునేందుకు జగన్ తాపత్రయపడుతున్నారని ఆరోపించారు.