ఆంధ్రప్రదేశ్‌

దీక్ష విరమించిన ముద్రగడ కొడుకు, కోడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 18: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి గత వారం రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలలో దీక్ష చేస్తున్న పద్మనాభం కుమారుడు ము ద్రగడ గిరి, కోడలు సిరి శనివారం రాత్రి 10గంటలకు దీక్ష విరమించారు. ఈ సందర్భంగా గిరి, సిరితోపాటు ముద్రగడ వియ్యంకుడు శివాజీ విలేఖర్లతో మాట్లాడుతూ వైద్యుల సూచనల మేరకు దీక్ష విరమించినట్టు తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలో సరైన సదుపాయాల్లేవని, నలుగురికీ కలిపి ఒకే గదిని కేటాయించారని, ఒకే బాత్రూమ్‌ను వినియోగించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాలు లేకపోవడం వల్ల ముద్రగడ పద్మనాభం సతీమణి పద్మావతి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ముద్రగడ లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తుని వెళ్లి అక్కడ నుండి విశాఖపట్టణంలో మెరుగైన వైద్యసేవలు పొందుతారని ఆయన తెలిపారు. కాగా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, అర్బన్ ఎస్పీ బి రాజకుమారి వారితో చర్చలు జరిపి వారిని దీక్ష విరమింపజేసినట్టు సమాచారం. దీక్ష విరమించిన అనంతరం
గిరి, సిరి దంపతులు తుని బయల్దేరి వెళ్లారు.

చిత్రం కారులో బయలుదేరిన ముద్రగడ కొడుకు, కోడలు