ఆంధ్రప్రదేశ్‌

సింహగిరిలో దాగిన సృష్టి అద్భుతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూన్ 18: సింహాచలం.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి. ప్రపంచంలో మరెక్కడా కానరాని వరాహ, నారసింహ అవతారాల కలయికతో శ్రీ మహావిష్ణువుఆవిర్భవించాడని, ఈ క్షేత్రాన్ని దేవతలు నిర్మించారని, ఇదొక అద్భుత ఆధ్యాత్మిక కేంద్రమని మాత్రమే ఇన్నాళ్ళు మనకు తెలుసు. సింహాచలేశుడు కొలువుదీరిన ఈ సింహగిరి జీవ వైవిధ్యానికి తరగని నిధి అని, సృష్టి అద్భుతాలెన్నో ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయని సాక్షాత్తు పర్యావరణ నిపుణులే తేల్చి చెబుతున్నారు. సింహాచలం దేవస్థానం ఆహ్వానం మేరకు శనివారం సింహగిరికి వచ్చిన ఆంధ్ర విశ్వ విద్యాలయం అధ్యాపకులు, జాతీయ పర్యావరణ అంచనా నిపుణుల కమిటీ సభ్యుడు డాక్టర్ కె. కామేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, ఎం.వెంకయ్య, రామస్వామి యాదవ్, పడాల్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ రత్నకుమార్ బృందం సింహగిరిలో దాగి ఉన్న జీవవైవిధ్య రహస్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. 1960వ దశకంలో జీవ వైవిధ్యానికి సంబంధించి సింహగిరిపై నిర్వహించిన పరిశోధనల పత్రాలతో పాటు ఇటీవలి కాలంలో చేసిన పరిశీలనలతో పోల్చి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి వివరించారు. సీతాకోక చిలుకలు అంతరించి పోవడానికి జీవ వైవిధ్యంలో వచ్చిన మార్పులే కారణమన్న విషయాన్ని కమిటీ వెల్లడించడంతో పాటు కొన్ని రకాల వృక్ష జాతులను పెంచడం ద్వారా సీతాకోక చిలుకల పునరుత్పత్తి సాధించుకోవచ్చని కమిటీ స్పష్టం చేసింది. అంతరించి పోయిన వృక్ష జాతులను సైతం తిరిగి అభివృద్ధి చేసుకొనే అద్భుత అవకాశాలు సింహగిరి పై ఉన్నాయని కమిటీ వివరించింది. ఒకప్పుడు సింహగిరిపై ప్రకృతి సిద్ధంగా ప్రవహించే పద్నాలుగు జలధారలు, రెండు వందల రకాల పక్షి జాతులతో పాటు అనేక రకాల జంతు, జీవ జాతులు, కీటకాలు ఉండేవన్న వాస్తవాలు నిపుణుల కమిటీ చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోందని దేవస్థానం ఈవో కె. రామచంద్రమోహన్ చెప్పారు. నిపుణుల కమిటీ వెల్లడించిన వివరాలను ఆయన విలేఖరులకు వివరించారు. ఎన్నో అద్భుతాలకు నెలవుగా సింహగిరి ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్వక్తం చేసారు. సుమారు పది లక్షల టన్నుల కాలుష్యాన్ని గ్రహించగల వృక్ష జాతులను సింహగిరిపై పెంచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పరిసర ప్రాంతాల్లో అనేక కొండలు ఉన్నప్పటికీ సింహగికి ఉన్న ప్రత్యేకత మరేకొండకు లేదన్నది పరిశోధనల్లో తేలిన వాస్తవమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు ఆదేశాల మేరకు యూనివర్సిటీ నిపుణులతో చర్చించి ఆహ్వానించామన్నారు. రెండేళ్ళ కిందట విశాఖను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను కారణంగా సింహగిరిపై చాలా వృక్ష జాతులు దెబ్బతిన్నాయన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం అత్యవసరమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో ప్రభావం చూపే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని ప్రతిపాదించినట్లు ఈవో వెల్లడించారు. కనీసం పదేళ్ల కాలపరిమితిని విధించుకొని శాశ్వత ప్రాతిపదికపై ప్రాజెక్టు రూపొందించుకోవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.