ఆంధ్రప్రదేశ్‌

మరో రెండు రోజులు దీక్ష తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 18: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష మరో రెండు రోజులు తప్పదని తెలుస్తోంది. తుని ఘటనలో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న 13 మంది బెయిల్‌పై విడుదలైన తర్వాతే దీక్ష విరమిస్తానని షరతు పెట్టిన ముద్రగడ పద్మనాభం దీక్ష సోమవారం వరకు సాగే పరిస్థితి ఎదురైంది.
ఇంకా ముగ్గురు కీలక నాయకులకు బెయిల్ రావాల్సి ఉంది. నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు బెయిల్ పిటీషన్ సోమవారానికి వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఎనిమిది మంది శనివారం రాత్రికి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. పది మందికి బెయిల్ మంజూరు కాగా, ఇందులో ఒకరి బెయిల్ టెక్నికల్‌గా నిలిచింది. మరొకరిని సిబిసిఐడి కస్టడీకి తీసుకోవడంతో ఎనిమిది మంది మాత్రమే విడుదలయ్యారు. ఇప్పటికే పది మంది వరకు ఏదోవిధంగా బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి కనీసం కుటుంబ సభ్యులనైనా దీక్ష విరమింపజేసేందుకు జెఎసి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే ముద్రగడ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. సెలైన్లపై ఎక్కువరోజుల పాటు ఆరోగ్యాన్ని కాపాడలేమని వైద్యులు చెబుతున్నారు. ఆహారం తీసుకుంటే తప్ప తదుపరి వైద్యం చేయలేమని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే 13 మంది బయటకు వచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదంటోన్న ముద్రగడ ఆరోగ్యం మరో రెండురోజుల పాటు అంటే దాదాపు సోమ, మంగళవారం వరకు ఎలా కాపాడాలా అని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆహారం ఇవ్వకుండా వైద్యం కుదరదని వైద్యులు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.