అంతర్జాతీయం

గేట్లు దూకేవాడిని కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 19: దేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయి మనీ లాండరింగ్ కేసులో నేరస్థుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా గురువారం సాయంత్రం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (ఎల్‌ఎస్‌ఇ)లో భారత హైకమిషనర్ నవ్‌తేజ్ సర్నా సమక్షంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరవడంపై ఎదురుదాడికి దిగాడు. తానేమీ ‘గేట్లు దూకేవాడిని’ కాదని మాల్యా ఆదివారం స్పష్టం చేస్తూ, నిర్వాహకుల ఆహ్వానం మేరకే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని సూచన ప్రాయంగా వెల్లడించాడు. భారత హైకమిషనర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకుల్లో మాల్యా కూడా ఉండటంపై దుమారం రేగడంతో ఈ అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ) శనివారం వివరణ ఇచ్చి కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో మాల్యా పేరు లేదని స్పష్టం చేసిన విషయం విదితమే. అయితే దీనిపై మాల్యా స్పందిస్తూ, తానేమీ గేట్లు దూకేవాడిని కాదని, జీవితంలో ఎప్పుడూ గేటు దూకలేదని, ఇకముందు కూడా ఆ పని చేయబోనని ఆదివారం ట్వీట్ చేశాడు. పుస్తక రచయిత అయిన తన మిత్రుడి కోసమే ఈ కార్యక్రమానికి వెళ్లి అక్కడ తన కుమార్తె పక్కన కూర్చున్నానని మాల్యా తెలిపాడు. మనీ లాండరింగ్ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు, అభియోగపత్రాలు (చార్జిషీట్లు) లేకుండానే తనను నేరస్థుడిగా ప్రకటించడం, ఈ కేసులో తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని మాల్యా వాపోయాడు.
యూకేను సంప్రదించలేదు: సుష్మా
న్యూఢిల్లీ: విజయ్‌మాల్యాతోపాటు ఐపిఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీలను భారత్‌కు అప్పగించాలంటూ బ్రిటన్‌ను ఇంకా సంప్రతించలేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ఈ రెండు కేసులను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, తదితర దర్యాప్తు సంస్థలు తమ మంత్రిత్వశాఖకు పూర్తి డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉందని ఆమె అన్నారు.
‘‘రెండు కేసుల్లో అప్పగింతకు సంబంధించిన వినతులు అందిన వెంటనే వాటిని యునైటెడ్ కింగ్‌డమ్‌కు పంపిస్తాం’’ అని ఆమె వివరించారు.

ఇండోనేసియాను
ముంచెత్తిన వరదలు
35 మంది మృతి

బంజమెగర (ఇండోనేసియా), జూన్ 19: కుండపోత వర్షాలు ఇండోనేసియాను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా సెంట్రల్ ఇండోనేసియాలో భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండచరియల వల్ల 35 మంది మృతి చెందారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. నీట మునిగి ధ్వంసమైన గ్రామాలలో ప్రాణాలతో ఉన్న ప్రజలను రక్షించడానికి సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. ప్రధాన ద్వీపకల్పం జావాలో కుండపోత వర్షాలు, భారీ వరదల వల్ల అనేక మంది ప్రజలు గల్లంతయ్యారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. అధిక జనసాంద్రత గల సెంట్రల్ జావా రాష్ట్రం విరుచుకుపడ్డ వరదలు, విరిగిపడిన కొండచరియల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నది. అనేక నివాస ప్రాంతాలు నీటమునిగాయి. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భవనాల పైకప్పులపైకి ఎక్కిన దృశ్యాలు టివి ఫుటేజీలలో కన్పించాయి. సెంట్రల్ జావాలో 35 మంది మృతి చెందగా, 25 మంది గల్లంతయ్యారని, మరో 14మంది గాయపడ్డారని డిజాస్టర్ ఏజెన్సీ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రొహో తెలిపారు.