బిజినెస్

అగ్రిగోల్డ్ బాధితులకు బడ్జెట్‌లో నాలుగు వేల కోట్లు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి రూ.4000 కోట్లు కేటాయించాలని అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం డిమాండ్‌చేసింది. గత మూడు సంవత్సరాలుగా చేపట్టిన అనేక ఆందోళన కార్యక్రమాల ఫలితంగా మృతిచెందిన 96 కుటుంబాలకు రూ.5 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిందని బాధితుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు డిపాజిట్ సొమ్ము చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఇంతవరకు 180 మంది బాధితులు మనోవ్యథతో మృతిచెందారన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం చేస్తామని ప్రకటించినా నేటికీ పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తున్నట్టు చెప్పారు. ‘అగ్రిగోల్డ్ బాధితుల గడప గడపకు’ పేరుతో ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, బాధితులకు ధైర్యం చెబుతున్నామన్నారు. ఫిబ్రవరి 15,16 తేదీల్లో మండల స్థాయిలో జీపు యాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 19 నుంచి 21వ తేదీ వరకు అన్ని మం డల కేంద్రాల్లో బాధిత కుటుంబాలతో రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. బడ్జెట్‌లో నిధు లు కేటాయించి, ఏప్రిల్‌లో బాధితులకు చెల్లింపులు చేయని పక్షంలో చలో విజయవాడ పిలుపునిచ్చి, చావోరేవో తేల్చుకుంటామని హెచ్చరించారు. సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 19.52 లక్షల మంది అగ్రిగోల్డ్ మోసానికి బలయ్యారన్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో సుమారు 32 లక్షల మంది బాధితులు రోడ్డున పడగా సుమారు 8వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందన్నారు. న్యాయం కోసం జరిగే పోరాటానికి బాధితులందరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు.

10వ తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్
షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 11: పదవ తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్‌ను ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పట్టణంతోపాటు కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రాల్లో నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ, 10వ తరగతి విద్యార్థులకు షాద్‌నగర్ పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో, కొందుర్గు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మోడల్ టెస్ట్‌ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించిందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ప్రశాంత్ వివరించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ విద్యాసంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి టెస్ట్‌ల వల్లే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.