బిజినెస్

అడవుల్లో నీటి నిల్వలకు కందకాలు! రూ.10 కోట్ల బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11: అడవుల్లో కార్చిచ్చు నివారణకు, భూసారం కొట్టుకుపోకుండా కోత నివారణ, భూగర్భ జలాల పెంపు తదితరాలకు ప్రభుత్వం సంరక్షణా చర్యలు చేపట్టింది. ఇందుకుగాను అటవీ శాఖ ఆధ్వర్యంలో తూర్పు కనుమల్లో ‘వాట్’ (వాటర్ అబ్జార్బ్ ట్రెంచెస్) పేరుతో కందకాలు తవ్వుతోంది. నల్లమల అడవుల్లో ఇప్పటికే కందకాలు తవ్వకం పూర్తికాగా, ఇపుడు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తవ్వుతున్నారు. అటవీ ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెంపొందించడానికి, జంతు సంరక్షణ, పచ్చదనాన్ని పెంపొందించడానికి ఉద్ధేశించి వినూత్న తరహాలో కందకాలు తవ్వుతున్నారు. ప్రధానంగా కొండ వాలు ప్రాంతాల్లో కందకాల తవ్వకం చేపట్టారు. స్థానిక గిరిజనులకు ఈ కందకాల తవ్వకం పనుల్లో ఉపాథి కల్పిస్తున్నారు.
రాజమహేంద్రవరం అటవీ సర్కిల్ పరిధిలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో మొత్తం 340 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 142.06 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది. కాకినాడ డివిజన్‌లో 100 కిలోమీటర్లు, చింతూరు డివిజన్‌లో 40 కిలోమీటర్లు, ఏలూరు డివిజన్‌లో 100 కిలోమీటర్లు, కృష్ణా జిల్లాలో 100 కిలోమీటర్లు కందకాలు తవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. కాకినాడ డివిజన్‌లో 37 కిలోమీటర్లు, ఏలూరు డివిజన్‌లో 59 కిలోమీటర్లు, కృష్ణా జిల్లాలో 44 కిలోమీటర్లు వరకు కందకాల తవ్వకం పూర్తయింది. చింతూరు ప్రాంతంలో కందకాలు తవ్వకాన్ని స్థానిక ఆదివాసీలు నిరోధించారు. దీంతో ఈ ప్రాంతంలో తవ్వకం నిలిచిపోయింది. స్థానిక గిరిజనులకు కందకాల ప్రయోజనంపై అవగాహన కల్పించడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మార్చి నెలాఖరుకల్లా కందకాల నిర్మాణం పూర్తికి చర్యలు చేపట్టారు.
ఒక్కో కందకాన్ని మూడు మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతు, 20 మీటర్ల పొడవున తవ్వుతున్నారు. ఒక కందకానికి, మరో కందకానికి మధ్య కాస్తంత ఖాళీ ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ తవ్వకాలు సాగిస్తున్నారు. మిషనరీని ఉపయోగించి కందకాల పనులను టెండర్ల విధానంలో నిర్వహిస్తున్నారు. అడవుల్లో కురిసే వర్షాల వల్ల ఈ కందకాల్లో నిత్యం నీరు ఉండటంతోపాటు, చెట్లూ, చేమలతో పచ్చగా ఉంటాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని అటవీ అధికారులు చెబుతున్నారు.